అగ్గిపెట్టెల కర్మాగారాల మూత

ABN , First Publish Date - 2022-04-07T15:58:02+05:30 IST

ముడిపదార్థాల ధరలు విపరీతంగా పెరగటంతో రాష్ట్రంలో బుధవారం ఉదయం అగ్గిపెట్టెల కర్మాగారాలు మూతపడ్డాయి. గత మూడు నెలలుగా ముడిపదార్థాల ధరలు 30 నుంచి 40 శాతం మేర

అగ్గిపెట్టెల కర్మాగారాల మూత

చెన్నై: ముడిపదార్థాల ధరలు విపరీతంగా పెరగటంతో రాష్ట్రంలో బుధవారం ఉదయం అగ్గిపెట్టెల కర్మాగారాలు మూతపడ్డాయి. గత మూడు నెలలుగా ముడిపదార్థాల ధరలు 30 నుంచి 40 శాతం మేర పెరిగాయి ఈ పరిస్థితుల్లో ముడిపదార్థాల ధరలను తగ్గించేందుకు, చైనా నుంచి లైటర్ల దిగుమతిపై నిషేఽధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతూ అగ్నిపెట్టెల కర్మాగారాల యజమానులు ఈ నెల 17 వరకు బంద్‌ పాటించాలని నిర్ణయించారు. ఆ మేరకు  విరుదునగర్‌, సాత్తూరు, తిరునల్వేలి, తెన్‌కాశి, కావేరిపట్టినం, గుడియాత్తం తదతర ప్రాంతాల్లోని 300కు పైగా అగ్గిపెట్టెల తయారీ కర్మాగారాలను బుధవారం మూసివేశారు. ఈ కర్మాగారాలు మూతపడటంతో ఆరు లక్షల మంది కార్మికులు నష్టపోతున్నారని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. 

Updated Date - 2022-04-07T15:58:02+05:30 IST