మేనకోడలిపై అత్యాచారానికి పాల్పడి ఆ వీడియోను భర్తకు పంపిన మేనమామ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-04-13T17:35:57+05:30 IST

మేనమామ అంటే తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడంటారు. అలాంటిది ఓ మేనమామ మేనకోడలి జీవితంతో ఆటలాడుకున్నాడు.

మేనకోడలిపై అత్యాచారానికి పాల్పడి ఆ వీడియోను భర్తకు పంపిన మేనమామ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

మేనమామ అంటే తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడంటారు. అలాంటిది ఓ మేనమామ మేనకోడలి జీవితంతో ఆటలాడుకున్నాడు. ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లైనా ఆమెను వదల్లేదు. అత్యాచారానికి పాల్పడిన సమయంలో తీసిన వీడియోను ఆమె భర్తకు పంపించాడు. దీంతో ఆ యువతి కాపురం కూలిపోయింది. హర్యానాలోని జింద్‌లో ఈ దారుణం జరిగింది.


జింద్‌లోని ఓ గ్రామానికి చెందిన యువతికి కొన్ని రోజుల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు. అయితే ఇటీవల ఆ యువతి భర్త మొబైల్‌కు ఓ వీడియో వచ్చింది. అది తన భార్య అశ్లీల వీడియో కావడంతో అతను షాకయ్యాడు. అప్పటి నుంచి భార్యను దూరం పెట్టాడు. విడాకులు ఇస్తానని చెప్పి భార్యను పుట్టింటికి పంపేశాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించి తన భర్తకు అశ్లీల వీడియోను పంపిన తన మేనమామపై ఫిర్యాదు చేసింది. 


మేనమామ ప్రదీప్ 2018లో తనపై అత్యాచారం చేశాడని, ఆ దారుణాన్ని వీడియో తీశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఆ వీడియోను చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ తనపై లైంగిక వేధింపులు కొనసాగించాడని చెప్పింది. తనకు వివాహం జరిగిన తర్వాత కూడా మేనమామ తనను వదల్లేదని, రూ.2 లక్షలు ఇవ్వాలని, లేదంటే వీడియోను బంధువులందరికీ పంపిస్తానని బెదిరించాడని ఫిర్యాదు చేసింది. తన వద్ద అంత డబ్బు లేకపోవడంతో ఇవ్వలేదని, దాంతో ఆ వీడియోను తన భర్తకు పంపించాడని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 


Updated Date - 2022-04-13T17:35:57+05:30 IST