గణితశాస్త్ర నిపుణుడు

ABN , First Publish Date - 2021-01-10T06:08:20+05:30 IST

విక్రమ్‌, శ్రీనిధి శెట్టి జంటగా ఆర్‌ అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఎస్‌ఎస్‌ లలిత్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం ‘

గణితశాస్త్ర నిపుణుడు

విక్రమ్‌, శ్రీనిధి శెట్టి జంటగా ఆర్‌ అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఎస్‌ఎస్‌ లలిత్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం ‘కోబ్రా’. ఈ చిత్రం టీజర్‌ను శనివారం విడుదల చేశారు. టీజర్‌లో చూపించిన దాని ప్రకారం ఈ థ్రిల్లర్‌ చిత్రంలో విక్రమ్‌ పాత్ర పేరు కోబ్రా. ఆయన గణితశాస్త్ర నిపుణుడిగా కనిపిస్తున్నారు.

ప్రతి సమస్యకు గణితంలో పరిష్కారం ఉంటుందని నమ్మే కోబ్రా పలు గెట్‌ప్సలో ప్రపంచం అంతా తిరుగుతూ మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్స్‌ను పట్టిస్తుంటారు. కొత్త కొత్త గెట్‌ప్సలో విక్రమ్‌ ఆకట్టుకున్నారు. యాక్షన్‌ సీన్లు, విదేశీ లొకేషన్లు చిత్రంపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఈ చిత్రానికి ఏ ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. 


Updated Date - 2021-01-10T06:08:20+05:30 IST