విరిగిపడిన మట్టి చరియలు

Published: Sat, 20 Nov 2021 09:30:10 ISTfb-iconwhatsapp-icontwitter-icon
విరిగిపడిన మట్టి చరియలు

చెన్నై: భారీ వర్షాల కారణంగా నీలగిరిలోని పది ప్రాంతాల్లో మట్టి చరియలు కూలిపడ్డాయి. గురువారం రాత్రి కురిసిన వర్షాలకు నీలగిరి కుమరన్‌ నగర్‌ ప్రాంతంలోని నివాసగృహాల వద్ద మట్టి చరియలు విరిగిపడడంతో రెండిళ్లు ధ్వంసమయ్యాయి. ఐదిళ్లు పునాదులు కదలి వేలాడుతున్నాయి. కాంతల్‌ పుదునగర్‌లో ప్రహరీ గోడ కూలిపడటంతో ఓ ఇల్లు ధ్వంసమైంది. బోట్‌హౌస్‌ రోడ్డులోని ప్రహరీ గోడ కూలిపడటంతో రహదారి పక్కనే ఉన్న మినర ల్‌ వాటర్‌ సెంటర్‌ ధ్వంసమైంది. ఈ వర్షాలకు మొత్తం 12 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఊటీ- పుదు మంతు రోడ్డు, ఆటో రోడ్డు, కీళ్‌కల్‌వట్టి, ఎల్‌హిల్‌ వండిసోలై, అనిక్కొరై, ఎప్పనాడు, తునేరి, ముత్తోరై పాలాడ, కేత్తి తదితర ప్రాంతాల్లో మట్టి చరియలు కూలిపడ్డాయి. దీనితో ఆ ప్రాంతాల్లో వాహానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. మట్టి చరియలు కూలిన ప్రాంతాలను ఇన్‌ఛార్జి కలెక్టర్‌ కీర్తి ప్రియదర్శిని అధికారులతో కలిసి పరిశీలించారు.


ఏర్కాడులో ఏడు చోట్ల...

ఏర్కాడులో గురువారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు కురిసిన భారీ వర్షాలకు ఏడు ప్రాంతాల్లో మంటి చరియలు, బండరాళ్లు రహదారులలో విరిగిపడ్డాయి. దీంతో ఒండికడై, అన్నాపార్కు, కెనాల్‌ పార్కు, బోట్‌ హౌస్‌ తదితర ప్రాంతాలకు వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. ఇదే విధంగా ఘాట్‌రోడ్డులోను, కుప్పనూరు సహా పలు చోట్ల మట్టిచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.