మైక్ ఆపకుండా నిద్రపోయిన మౌల్వీ... తెగ నవ్వుకుంటున్న జనం!

ABN , First Publish Date - 2021-02-21T15:01:21+05:30 IST

ఇటీవల సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ శ్వేత పేరుతో ఒక ఆడియో...

మైక్ ఆపకుండా నిద్రపోయిన మౌల్వీ... తెగ నవ్వుకుంటున్న జనం!

న్యూఢిల్లీ: ఇటీవల సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ శ్వేత పేరుతో ఒక ఆడియో వైరల్‌గా మారింది. దానిలో ఒక యువతి ఆన్‌లైన్ మీటింగ్ ముగిసిన అనంతరం తన మైక్ బంద్ చేయడం మరిచిపోయింది. దీంతో ఆమెతో పాటు ఆమె స్నేహితులు మాట్లాడుకున్న పర్సనల్ విషయాలు బయటకు లీక్ అయ్యాయి. దీని తరువాత ఈ ఆడియోకు పలు వినోదాత్మక మీమ్స్ తయారయ్యాయి. ఇప్పుడు ఇదే విధమైన ఆడియో ఒకటి వైరల్‌గా మారింది. ఒక మౌల్వీ పొరపాటు కారణంగా ఇది జరిగిందని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే ఒక మౌల్వీ పొరపాటున మసీదుకు సంబంధించిన మైక్ ఆపకుండా నిద్రపోయారు. 


ఆ తరువాత మైక్‌లో వచ్చిన శబ్ధాలు విన్నవారంతా తెగనవ్వుకుంటున్నారు. ట్విట్టర్ యూజర్ @dapakiguy92 ఈ వీడియోను షేర్ చేశారు. దాని క్యాప్షన్ గా ‘మౌల్వీ సాబ్ మైక్ ఆపకుండా నిద్రపోయారు’ అని రాశారు. ఈ ఆడియోలో మౌల్వీ సాబ్ గురక వినిపిస్తోంది. దీనిని విన్నవారంతా పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పటి వరకూ వెల్లడి కాలేదు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకూ 51 వేల మంది వీక్షించారు. 

                                         ‘న్యూస్ అలర్ట్’ సౌజన్యంతో...

Updated Date - 2021-02-21T15:01:21+05:30 IST