సరిహద్దులను కాపాడేవారికి గరిష్ఠ సదుపాయాలు : రాజ్‌నాథ్ సింగ్

ABN , First Publish Date - 2022-05-07T18:55:42+05:30 IST

దేశ సరిహద్దులను కాపాడేవారికి గరిష్ఠ స్థాయిలో సదుపాయాలను

సరిహద్దులను కాపాడేవారికి గరిష్ఠ సదుపాయాలు : రాజ్‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ : దేశ సరిహద్దులను కాపాడేవారికి గరిష్ఠ స్థాయిలో సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. Boarder Roads Organisation (BRO) నిర్వహించిన కార్యక్రమంలో శనివారం ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వ సమగ్ర రక్షణ వ్యూహంలో చాలా ప్రధానమైనది సరిహద్దు ప్రాంతాలను అభివృద్ధి చేయడమేనని చెప్పారు. 


దేశ భద్రత కోసం పగలు, రాత్రి తేడా లేకుండా నిరంతరం పని చేసేవారికి గరిష్ఠ స్థాయిలో సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు.దేశ సరిహద్దులను వీరు కాపాడుతున్నారని పేర్కొన్నారు. దేశ సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక  సదుపాయాలను మెరుగుపరుస్తున్న బీఆరోఓను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఈశాన్య ప్రాంతాల అభివృద్ధిని ఉదాహరణగా చూపించారు. ఇది ఇప్పుడు దేశ సర్వతోముఖాభివృద్ధికి నూతన సింహద్వారంగా మారిందన్నారు. మానవ నాగరికత ప్రస్థానంలో రోడ్లకు గొప్ప ప్రాధాన్యం ఉందన్నారు. విద్య, ఆరోగ్యం, వ్యాపారం, ఆహార సరఫరా, వ్యూహాత్మక సైనిక అవసరాలు, పరిశ్రమలు, ఇతర సాంఘిక, ఆర్థిక ప్రగతి వంటివాటికి రోడ్లు చాలా ముఖ్యమని చెప్పారు. వీటిని సాధించాలంటే రోడ్లు, వంతెనలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.


Read more