అయితే ప్రధాని.. లేదంటే యూపీ సీఎం!

ABN , First Publish Date - 2022-04-29T09:44:51+05:30 IST

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనను రాష్ట్రపతి పదవికి ఎంపిక చేస్తుందంటూ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి..

అయితే ప్రధాని.. లేదంటే యూపీ సీఎం!

 అంతేతప్ప.. రాష్ట్రపతి పదవిపై ఆసక్తి లేదు:  మాయావతి

లఖ్‌నవూ, ఏప్రిల్‌ 28: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనను రాష్ట్రపతి పదవికి ఎంపిక చేస్తుందంటూ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. ఇలాంటి పనికిరాని మాటలను నమ్మవద్దన్నారు. రానున్న రోజుల్లో ప్రధాని పదవిని చేపట్టడం.. లేదా తిరిగి యూపీ సీఎం కావడంపై మాత్రమేతనకు ఆసక్తి ఉందని, అంతేతప్ప.. రాష్ట్రపతి పదవిలో కూర్చుని ప్రశాంత జీవితాన్ని గడపాలని లేదన్నారు. అఖిలేశ్‌ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక.. ఆయన సీఎం కావడానికి ఉన్న అడ్డంకిని తొలగించుకునే పెద్ద కుట్రే దాగి ఉందన్నారు.  

Updated Date - 2022-04-29T09:44:51+05:30 IST