ఏడుగురు ఎమ్మెల్యేలపై మాయా వేటు

ABN , First Publish Date - 2020-10-30T08:22:24+05:30 IST

రాజ్యసభ ఎన్నికలు బీఎస్పీలో ముసలం రేపాయి. తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు...

ఏడుగురు ఎమ్మెల్యేలపై మాయా వేటు

న్యూఢిల్లీ, అక్టోబరు 29 : రాజ్యసభ ఎన్నికలు బీఎస్పీలో ముసలం రేపాయి. తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలియగానే ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు. యూపీలో మొత్తం పది   రాజ్యసభ స్థానాలకు వచ్చేనెల తొమ్మిదో తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎస్పీ ఓటమే లక్ష్యంగా బీఎస్పీ బరిలోకి దిగింది. కాగా, బీఎస్పీ నుంచి ఎస్పీలోకి దూకడానికి ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు రంగం సిద్ధం చేసుకొన్నారు. వీరిలో ఆరుగురు బుధవారం ఎస్పీ నేత అఖిలేశ్‌ను కలిశారు కూడా. రాంజీ గౌతమ్‌ను బలపరుస్తూ దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాల్లో తమ సంతకాలను ఫోర్జరీ చేశారని వీరిలో నలుగురు.. రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు (అఫిడవిట్‌) చేశారు. దీంతో రెబెల్‌ ఎమ్మెల్యేలపై మాయావతి కొరడా ఝుళిపించారు. 

Updated Date - 2020-10-30T08:22:24+05:30 IST