యువత ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలి

ABN , First Publish Date - 2021-03-01T07:06:46+05:30 IST

యువత వ్యాపారాలతో స్వయం ఉపాధి పొందుతూ ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని గ్రేటర్‌ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అన్నారు.

యువత ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలి
కారులో వెళ్తున్న మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి

 ప్లెజర్‌ హంట్‌ ర్యాలీని ప్రారంభించిన మేయర్‌ విజయలక్ష్మి

ఖైరతాబాద్‌ ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): యువత వ్యాపారాలతో స్వయం ఉపాధి పొందుతూ ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని గ్రేటర్‌ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అన్నారు. ఓ సంస్థ నిర్వహించిన ప్లెజర్‌ హంట్‌ కార్యక్రమం నెక్లె్‌సరోడ్‌లోని పిట్‌ స్టాప్‌ నుంచి ప్రారంభమైంది. సంస్థ సభ్యులు కుటుంబ సమేతంగా నెక్లె్‌సరోడ్‌ నుంచి శామీర్‌పేట రిసార్టు వరకు వారి కార్లలో ఆధారాల ప్రకారం రిసార్టును గుర్తించే ప్లెజర్‌ హంట్‌లో పాల్గొన్నారు. పిట్‌ స్పాట్‌ వద్ద మేయర్‌ విజయలక్ష్మి ప్లెజర్‌ హంట్‌ ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. చిన్న వ్యాపారులను ప్రోత్సహిస్తూ చేయూత అందించాలని వ్యాపారులకు సూచించారు. ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ తరఫున సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు వారిజ్‌ఖాన్‌, కో-ఆర్డినేటర్‌ ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T07:06:46+05:30 IST