Covid Vaccine తీసుకున్న ప్రతి ఒక్కరికీ తలా రూ.7,400.. మేయర్ ప్రకటన

ABN , First Publish Date - 2021-07-29T21:00:10+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. ప్రజలు వ్యాక్సిన్ తీసుకునే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. భారీ మొత్తంలో తాయిలాలను కూడా ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగానే వ్యాక్సిన్ తీసుకు

Covid Vaccine తీసుకున్న ప్రతి ఒక్కరికీ తలా రూ.7,400.. మేయర్ ప్రకటన

వాషింగ్టన్: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. ప్రజలు వ్యాక్సిన్ తీసుకునే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. భారీ మొత్తంలో తాయిలాలను కూడా ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగానే వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి సుమారు రూ.7,400 చెల్లించనున్నట్టు ఓ నగరంలో ప్రకటన వెలువడింది. పూర్తి వివరాల్లోకి వెళితే..  



అగ్రరాజ్యాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. కార్చిచ్చులా డెల్టా వేరియంట్ అమెరికా మొత్తం వ్యాపిస్తోంది. న్యూయార్క్‌లో సైతం  కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో అమెరికాలో న్యూయార్క్ మళ్లీ కరోనా హాట్ స్పాట్‌గా మారబోతోందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్ ద్వారా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా న్యూయార్క్ సిటీ మేయర్ బిల్ డి బ్లాసియో కీలక నిర్ణయం తీసుకున్నారు. నగర ప్రజలు న్యూయార్క్ సిటీలోని ఏ వ్యాక్సినేషన్ కేంద్రంలో అయినా సరే వ్యాక్సిన్ తీసుకోవచ్చని వెల్లడించారు. అంతేకాకుండా.. వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరికీ తలా 100 డాలర్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నగదు ఇవ్వడం ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే.. న్యూయార్క్ సిటీలో 59.2 మంది ప్రజలు కనీసం ఒక డోసు కరోనా టీకా తీసుకోగా.. దాదాపు 40.8శాతం మంది వ్యాక్సిన్ తీసుకోలేదు. 


Updated Date - 2021-07-29T21:00:10+05:30 IST