డిసెంబర్ 15 నాటికి న్యూయార్క్‌కు వ్యాక్సిన్: మేయర్

ABN , First Publish Date - 2020-12-05T14:58:17+05:30 IST

న్యూయార్క్ నగరానికి డిసెంబర్ 15 నాటికి కొవిడ్ వ్యాక్సిన్ ఎగుమతి ప్రారంభం అవుతుందని శుక్రవారం మేయర్ బిల్ డి బ్లాసియో వెల్లడించారు.

డిసెంబర్ 15 నాటికి న్యూయార్క్‌కు వ్యాక్సిన్: మేయర్

న్యూయార్క్: న్యూయార్క్ నగరానికి డిసెంబర్ 15 నాటికి కొవిడ్ వ్యాక్సిన్ ఎగుమతి ప్రారంభం అవుతుందని శుక్రవారం మేయర్ బిల్ డి బ్లాసియో వెల్లడించారు. హెల్త్‌కేర్ వర్కర్స్, నర్సింగ్ హోం రెసిడెంట్స్‌కు తొలి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని బ్లాసియో స్పష్టం చేశారు. "మనం కొవిడ్‌-19తో భయంకరమైన పోరాటం చేస్తున్నాం. కానీ ఈ నెలలో శత్రువును అంతమొందించే ఆయుధం(వ్యాక్సిన్) రాబోతోంది. ప్రతి న్యూయార్కర్‌కు టీకా అందిస్తాం." అని మీడియాతో మాట్లాడుతూ బ్లాసియో అన్నారు. ఇక న్యూయార్క్‌లో వైరస్ వ్యాప్తి గడిచిన వారం రోజుల్లో సగటున 5 శాతం దాటి.. 5.19 శాతానికి చేరినట్టు ఆరోగ్యశాఖ అధికారులు గురువారం వెల్లడించారు. అంతకుముందు వారంలో ఇది 4.8 శాతంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, న్యూయార్క్‌లో ఇప్పటివరకు 3.21 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 24వేలకు పైగా మందిని వైరస్‌ కబళించింది.  

Updated Date - 2020-12-05T14:58:17+05:30 IST