ప్రార్థనల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

ABN , First Publish Date - 2021-04-22T05:11:29+05:30 IST

గుంటూరు నగరంలో దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో భక్తులు చేసుకునే ప్రార్థనలు కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా చేసుకోవాలని నగర మేయర్‌ కావటి శివనాగ మనోహరనాయుడు సూచించారు.

ప్రార్థనల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించాలి
మాట్లాడుతున్న మేయర్‌ కావటి, పక్కన ఎమ్మెల్యేలు మద్దాళి, ముస్తఫా, కమిషనర్‌ అనురాధ

నగర మేయర్‌ కావటి 

గుంటూరు (కార్పొరేషన్‌), ఏప్రిల్‌ 21: గుంటూరు నగరంలో దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో భక్తులు చేసుకునే ప్రార్థనలు కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా చేసుకోవాలని నగర మేయర్‌ కావటి శివనాగ మనోహరనాయుడు సూచించారు. నగరపాలక సంస్థ కౌన్సిల్‌ మందిరంలో బుధవారం మేయర్‌ ముస్లిం పెద్దలు, చర్చి, ఆలయాల కమిటీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ పవిత్ర రంజాన్‌ మాసంలో నిబంధనల మధ్యలో ప్రార్థనలు చేసుకోవాల్సి రావడం బాధాకరమైన అంశమన్నారు. ఆసుపత్రులలో బెడ్స్‌ కూడా ఖాళీ లేవని, కరోనా నుంచి స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని, లాక్‌డౌన్‌ అమలు చేయబోమని స్పష్టంచేశారు. ఈ నెల 25 నుంచి కొవిడ్‌ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని నిర్ణయించారు. ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ ముస్లింలు మసీదుల వద్ద గుమికూడవద్దని, సాయంత్రం ఏడు తర్వాత ఇంటిలోనే ప్రార్ధనలు చేసుకోవాలి సూచించారు. పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరి మాట్లాడుతూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటే తప్ప కరోనాని అడ్డుకోలేమన్నారు. కమిషనర్‌ చల్లా అనురాధ మాట్లాడుతూ అవసరం ఉంటే తప్ప ఎవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని కోరారు. మసీదుల వద్ద ప్రత్యేక పారిశుధ్య పనులు చేపడతామన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్‌ నిరంజన్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్‌లు డి.శ్రీనివాసరావు, బి.శ్రీనివాసరావు, వెంకటకృష్ణయ్య, ఎస్‌ఎస్‌లు రాంబాబు, ఆనందకుమార్‌, ఆయా మతపెద్దలు, చర్చి, మసీదు కమిటీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-22T05:11:29+05:30 IST