నగరాభివృద్ధికి ప్రణాళికాబద్దంగా చర్యలు

ABN , First Publish Date - 2021-12-04T05:53:08+05:30 IST

గుంటూరు నగరాభివృద్ధికి ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు అన్నారు.

నగరాభివృద్ధికి ప్రణాళికాబద్దంగా చర్యలు
సమావేశంలో ప్రసంగిస్తున్న మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌నాయుడు, పక్కన కమిషనర్‌ అనురాధ

మేయర్‌ మనోహర్‌ నాయుడు

గుంటూరు(కార్పొరేషన్‌), డిసెంబరు3: గుంటూరు నగరాభివృద్ధికి ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్‌ కావటి  మనోహర్‌నాయుడు అన్నారు. శుక్రవారం తన ఛాంబర్‌లో స్థాయి సంఘ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కమిషనర్‌ చల్లా అనురాధ, స్థాయి సంఘం సభ్యులు పోలవరపు జ్యోతి, వేముల జ్యోతి, పద్మజ, వెంకటకృష్ణ, హేమలత, షేక్‌ అబీద్‌, ఎస్‌ఈ శ్రీనివాసరావు  తదితరులు పాల్గొన్నారు.

ప్లాస్టిక్‌ కవర్ల నిషేదాన్ని అమలు చేయాలి

నగరంలో ప్లాస్టిక్‌ కవర్ల వినియోగంపై నిషేధం ఉందని ప్రజలు ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచులను వినియోగించాలని నగర కమిషనర్‌ చల్లా అనురాధ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.

 

Updated Date - 2021-12-04T05:53:08+05:30 IST