‘బడంగ్‌పేట’లో..మారనున్న సమీకరణాలు

ABN , First Publish Date - 2022-07-03T17:08:05+05:30 IST

బడంగ్‌పేట కార్పొరేషన్‌ మేయర్‌ పారిజాతానర్సింహారెడ్డి దంపతులు టీఆర్‌ఎ్‌సను వీడి కాంగ్రె్‌సలో చేరాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో.. ఇంకా ఎంత మంది కార్పొరేటర్లు వారి

‘బడంగ్‌పేట’లో..మారనున్న సమీకరణాలు

 మంత్రి సమావేశానికి డుమ్మా

మేయర్‌ వెంట ముగ్గురు

 కాంగ్రెస్‌లో చేరనున్న సంతోషి శ్రీనివాస్‌రెడ్డి

బీజేపీ, కాంగ్రెస్‌ సభ్యులకు టీఆర్‌ఎస్‌ ఎర?


హైదరాబాద్/సరూర్‌నగర్‌: బడంగ్‌పేట కార్పొరేషన్‌ మేయర్‌ పారిజాతానర్సింహారెడ్డి దంపతులు టీఆర్‌ఎ్‌సను వీడి కాంగ్రె్‌సలో చేరాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో.. ఇంకా ఎంత మంది కార్పొరేటర్లు వారి వెంట నడుస్తారు.. టీఆర్‌ఎ్‌సలో ఎందరు మిగులుతారు? అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే మేయర్‌ ఐదారుగురు టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లను తనకు అనుకూలంగా మలుచుకున్నట్టు తెలిసింది. ఇప్పటికిప్పుడు కాకపోయినా కొన్ని నెలల తర్వాతైనా సదరు కార్పొరేటర్లు టీఆర్‌ఎ్‌సకు గుడ్‌ బై చెప్పవచ్చుననే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఒక కార్పొరేటర్‌ తాను మేయర్‌ వెంటే ఉంటానని, వారితో పాటు కాంగ్రె్‌సలో చేరుతానని స్వయంగా మంత్రి సబితారెడ్డికే స్పష్టంగా చెప్పడం గమనార్హం! 


మంత్రి సమావేశానికి ముగ్గురు డుమ్మా

మేయర్‌ పారిజాతానర్సింహారెడ్డి గత గురువారం రేవంత్‌రెడ్డిని కలవడంతో వెంటనే అప్రమత్తమైన మంత్రి సబితారెడ్డి శుక్రవారం తన ఛాంబర్‌లో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముందు అందరితో చర్చ జరిపి, అనంతరం విడివిడిగా ఒక్కొక్కరితో కూడా మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకున్నట్టు తెలిసింది. కాగా మొత్తం 16 (మేయర్‌ మినహా) మంది టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లకుగాను 13మంది హాజరు కాగా ముగ్గురు సభ్యులు డుమ్మా కొట్టినట్టు తెలిసింది. వారిలో ఒకరు తమ కుటుంబ ఆస్తి పంపకాల రిజిస్ర్టేషన్‌ కారణంగా రాలేకపోయినట్టు వివరణ ఇవ్వ గా, ఇంకొకరు తమ కుటుంబంలో ఒకరికి ఆరోగ్యం బాగా లేనందున రాలేదని మంత్రికి చెప్పినట్టు సమాచారం. మరో కార్పొరేటర్‌ మాత్రం తాను కాంగ్రె్‌సలో చేరబోతున్నట్టు ఇంతకు ముందే మంత్రి సబితారెడ్డితో చెప్పినట్టు తెలిసింది. హాజరైన వారిలోనూ కొందరు మేయర్‌తో టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దాంతో ఎంత మంది కార్పొరేటర్లు కాంగ్రె్‌సలో చేరుతారు.. టీఆర్‌ఎ్‌సలో ఎందరు మిగులుతా రు? అనే చర్చ స్థానికంగా కొనసాగుతోంది. మరోపక్క మం త్రితో సమావేశంలో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. 

మేయర్‌తో పాటు ఇద్దరు కార్పొరేటర్లను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు రాత్రి పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రకటించారు. 


మేయర్‌ వెంటే కాంగ్రెస్ లోకి: సంతోషీశ్రీనివా్‌సరెడ్డి 

మేయర్‌తో పాటు కాంగ్రె్‌సలో చేరాలని నిర్ణయించుకున్నట్టు 23వ డివిజన్‌ కార్పొరేటర్‌ రాళ్లగూడెం సంతోషీశ్రీనివా్‌సరెడ్డి దంపతులు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని మంత్రి సబితారెడ్డికి స్పష్టంగా చెప్పామని వారన్నారు. తాము కాంగ్రెస్‌ కార్పొరేటర్‌గానే గెలిచామని, తిరిగి అదే పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. 


ప్రతిపక్ష సభ్యులకు టీఆర్‌ఎస్‌ గాలం?

తమ పార్టీ సభ్యులు గోడ దూకుతుండడంతో అప్రమత్తమైన టీఆర్‌ఎస్‌ పెద్దలు.. బీజేపీ, కాంగ్రెస్‌ సభ్యులకు గాలం వేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం బడంగ్‌పేటలో బీజేపీకి పది మంది, కాంగ్రె్‌సకు నలుగురు సభ్యులు ఉన్నారు. కాంగ్రె్‌స కార్పొరేటర్‌ టీఆర్‌ఎ్‌సలో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బీజేపీకి చెందిన ఒకరిద్దరు సభ్యులను సైతం తమ పార్టీలోకి చేర్చుకోవడానికి అధికార పార్టీ పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఓ బీజేపీ కార్పొరేటర్‌ ఆధీనంలో కొంత ప్రభుత్వ స్థలం ఉన్నదని, దానిని అడ్డుపెట్టుకుని సదరు కార్పొరేటర్‌ను తమ పార్టీలోకి లాగాలని టీఆర్‌ఎస్‌ భావిస్తున్నట్టు తెలిసింది. ఆ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయన్నది వేచి చూడాల్సిందే.


టీఆర్‌ఎస్‌ సమావేశానికి డిప్యూటీ మేయర్‌

శుక్రవారం మంత్రి సబితారెడ్డి తన చాంబర్‌లో ఏర్పా టు చేసిన టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల సమావేశానికి బీఎస్పీకి చెందిన డిప్యూటీ మేయర్‌ ఇబ్రాం శేఖర్‌ సైతం హాజరుకావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పైగా సదరు సమావేశం మొత్తం ఆయనే లీడ్‌ చేశారని, సభ్యులందరి మధ్య సమన్వయం కుదర్చడానికి ప్రయత్నించారని తెలిసింది. దాంతో ఆయన కూడా టీఆర్‌ఎ్‌సలో చేరుతారేమో అనే ప్రచారం జరుగుతోంది. అయితే తాను మంత్రి సబితారెడ్డి కారణంగానే డిప్యూటీ మేయర్‌ పదవి దక్కించుకున్నానని, అందుకు కృతజ్ఞతగా ఆ పార్టీలో సఖ్యతకు ప్రయత్నం చేస్తున్నానని ఆయన తన సన్నిహితుల వద్ద పేర్కొన్నట్టు తెలిసింది.

Updated Date - 2022-07-03T17:08:05+05:30 IST