వరంగల్‌లో పోతన విగ్రహ పరిసరాలు శుభ్రంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-06-17T05:14:01+05:30 IST

వరంగల్‌లో పోతన విగ్రహ పరిసరాలు శుభ్రంగా ఉండాలి

వరంగల్‌లో పోతన విగ్రహ పరిసరాలు శుభ్రంగా ఉండాలి
పోతన విగ్రహం వద్ద అధికారులతో మేయర్‌ గుండు సుధారాణి

 మేయర్‌ గుండు సుధారాణి

వరంగల్‌ సిటీ, జూన్‌ 16 : వరంగల్‌ జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న పోతన విగ్రహం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని మేయర్‌ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. పోతన విగ్రహం ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. జంక్షన్‌ నలువైపులా పచ్చదనం కనిపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

టీకా తీసుకున్న మేయర్‌ 

మేయర్‌ గుండు సుధారాణి కరోనా నియంత్రణ టీకా తీసుకున్నారు. పెద్దమ్మగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్‌ తీసుకున్న అనంతరం మాట్లాడారు. నగరంలోని మహిళా  సంఘాలు, మెప్మా సిబ్బందికి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా తొలి రోజు బుధవారం 750 మందికి టీకా వేసినట్లు చెప్పారు. 

పూడికతీత పనులు పూర్తి చేయండి

నగరంలోని నాలాలు, ప్రధాన కాలువల్లో చేపట్టిన పూడికతీత పనులను త్వరగా పూర్తి చేయాలని మే యర్‌ సుధారాణి అధికారులను ఆదేశించారు. 29వ డి విజన్‌లో జరుగుతున్న పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాగునీరు సరఫరా కావడం లేదని ఓయస్‌ నగర వాసులు మేయర్‌కు విన్నవించారు. అధికారులను ఫోన్‌లో సంప్రదించి వెంటనే నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

మేయర్‌ను కలిసిన స్పోర్ట్స్ట్‌ డైరెక్టర్‌

స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ అనూ్‌పకుమార్‌, బ్యాడ్మింటన్‌ కోచ్‌ శ్రీధర్‌ బుధవారం మేయర్‌ గుండు సుధారాణిని బల్దియాలో మర్యాదపూర్వకంగా కలిశారు.  మేయర్‌కు శుభాకాంక్షలు తెలియచేశారు. అలాగే మేయర్‌ గుండు సుధారాణిని  ప్రగతిశీల మర్వాడీ సమాజ్‌, మహేశ్వరీ సమాజ్‌తో పాటు లైసెన్స్డ్‌ సర్వేయర్స్‌, బిల్‌ కలెక్టర్లు కలిసి సన్మానించారు.

Updated Date - 2021-06-17T05:14:01+05:30 IST