సిటీ కాప్స్‌కు చుక్కలు చూపిస్తున్న ఎంబీఏ గ్రాడ్యుయేట్
ABN , First Publish Date - 2021-08-31T03:30:44+05:30 IST
నగర పోలీసులకు ఓ ఎంబీఏ గ్రాడ్యుయేట్ చుక్కలు చూపిస్తున్నాడు. లగ్జరీ
హైదరాబాద్: నగర పోలీసులకు ఓ ఎంబీఏ గ్రాడ్యుయేట్ చుక్కలు చూపిస్తున్నాడు. లగ్జరీ కార్లను హైటెక్ టెక్నాలజీతో ఎంబీఏ విద్యార్థి ఎత్తుకెళ్తున్నాడు. జైపూర్‌కు చెందిన సత్యేంద్ర షెకావత్ కోసం ఏడాది నుంచి నగర పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్, రాచకొండ పరిధిలో పలు లగ్జరీ కార్లను షెకావత్ దోచేసాడు. టెక్నికల్ నాలెడ్జ్‌తో సాఫ్ట్వేర్ రూపొందించి కార్లను అపహరిస్తున్నాడు. పార్క్ హయత్‌లో ప్రొడ్యూసర్ కారును షెకావత్ దొంగలించాడు. కేసు నమోదు చేసుకుని జైపూర్‌కు బంజారాహిల్స్ పోలీసులు వెళ్లారు. జైపూర్‌లో షెకావత్ భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమె బెయిల్‌పై విడుదల అయింది. షెకావత్ కోసం మూడు కమిషనరేట్ల పోలీసులు గాలిస్తున్నారు.