Pune Nikmarలో ఎంబీఏ, పీజీ డిప్లొమా

ABN , First Publish Date - 2022-06-22T22:20:23+05:30 IST

పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ (నిక్మర్‌) యూనివర్సిటీ - ఎంబీఏ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నిక్మర్‌

Pune Nikmarలో ఎంబీఏ, పీజీ డిప్లొమా

పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ (నిక్మర్‌) యూనివర్సిటీ - ఎంబీఏ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నిక్మర్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (ఎన్‌సీఏటీ), గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ, రేటింగ్‌ ఆఫ్‌ అప్లికేషన్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఇవి ఫుల్‌ టైం ప్రోగ్రామ్‌లు. ఎంబీఏ ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. పీజీ డిప్లొమా వ్యవధి ఏడాది. ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ వ్యవధి అయిదేళ్లు.


ఎంబీఏ (అడ్వాన్స్‌డ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌): 

ఈ ప్రోగ్రామ్‌లో 540 సీట్లు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ద్వితీయ శ్రేణి మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ(ఇంజనీరింగ్‌/ ఆర్కిటెక్చర్‌/ ప్లానింగ్‌) పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఎంబీఏ(అడ్వాన్స్‌డ్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌): ఈ ప్రోగ్రామ్‌లో 120 సీట్లు ఉన్నాయి. కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ(ఇంజనీరింగ్‌/ ఆర్కిటెక్చర్‌/ ప్లానింగ్‌/ సైన్స్‌/ ఆర్ట్స్‌/ కామర్స్‌/ ఫైనాన్స్‌/ బ్యాం కింగ్‌/ మేనేజ్‌మెంట్‌/ ఎకనామిక్స్‌/ మేథమెటిక్స్‌/ స్టాటిస్టిక్స్‌/ అగ్రికల్చర్‌/ ఫార్మసీ/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) ఉత్తీర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు.  

ఎంబీఏ(రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌): ఇందులో 60 సీట్లు ఉన్నాయి. ద్వితీయ శ్రేణి మార్కులతో డిగ్రీ(ఇంజనీరింగ్‌/ ఆర్కిటెక్చర్‌/ ప్లానింగ్‌/ కామర్స్‌/ ఫైనాన్స్‌/ బ్యాంకింగ్‌/ మేనేజ్‌మెంట్‌/ ఎకనామిక్స్‌/ మేథమెటిక్స్‌/ స్టాటిస్టిక్స్‌) ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.  

పీజీ డిప్లొమా(మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ ఫ్యామిలీ ఓన్డ్‌ కన్‌స్ట్రక్షన్‌ బిజినెస్‌): ఇందులో 30 సీట్లు ఉన్నాయి. ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. వీరికి సొంతంగా కన్‌స్ట్రక్షన్‌ బిజినెస్‌ ఉండాలి. దీనికి సంబంధించిన ధ్రువపత్రాలను దరఖాస్తుకు జతచేయాలి.  

పీజీ డిప్లొమా (క్వాంటిటీ సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌): ఈ ప్రోగ్రామ్‌లో 30 సీట్లు ఉన్నాయి. ద్వితీయ శ్రేణి మార్కులతో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు. 

ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ: ఇందులో బీబీఏ + ఎంబీఏ కోర్సులు ఉంటాయి. ఈ ప్రోగ్రామ్‌లో 60 సీట్లు ఉన్నాయి.  2020, 2021 అకడమిక్‌ సంవత్సరాల్లో ఇంటర్‌/ పన్నెండో తరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు; ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాసి ఫలితాల కోసం చూస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రథమ శ్రేణి మార్కులు తప్పనిసరి. అభ్యర్థులు 2002 ఆగస్టు 1న, ఆ తరవాత జన్మించి ఉండాలి.

అడ్మిషన్‌ టెస్ట్‌ వివరాలు: ఎంబీఏ, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి ఆన్‌లైన్‌ విధానంలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ నిక్మర్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇందులో క్వాంటిటేటివ్‌ అండ్‌ అనలిటికల్‌ ఎబిలిటీ నుంచి 72, డేటా ఇంట్రప్రిటేషన్‌ నుంచి 36, వెర్బల్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీ నుంచి 72 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు 180. ఇందులో సాధించిన మెరిట్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌ మోడ్‌లో గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. గ్రూప్‌ డిస్కషన్‌కు 20 మార్కులు, పర్సనల్‌ ఇంటర్వ్యూకి 30 మార్కులు, రేటింగ్‌ ఆఫ్‌ అప్లికేషన్‌కు 70 మార్కులు ప్రత్యేకించారు. అడ్మిషన్‌ టెస్ట్‌ స్కోర్‌నకు 60 శాతం; గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలకు 16.67 శాతం; రేటింగ్‌ ఆఫ్‌ అప్లికేషన్‌ కింద 23.33 శాతం వెయిటేజీ ఇస్తారు.

  • ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏలో ప్రవేశానికి ఆన్‌లైన్‌ విధానంలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ నిక్మర్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌ అంశాలనుంచి ఒక్కోదానిలో 25 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు 100. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూకి 50 మార్కులు కేటాయించారు. అడ్మిషన్‌ టెస్ట్‌ స్కోర్‌నకు 66.67 శాతం, ఇంటర్వ్యూకి 33.33 శాతం వెయిటేజీ ఇస్తారు.


ముఖ్య సమాచారం

ఎంబీఏ, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లకు:

దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: జూలై 3 

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ నిక్మర్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ తేదీలు: జూలై 8, 9

గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలు: జూలై 10, 11

ఫలితాలు విడుదల: జూలై 14

ప్రోగ్రామ్‌లు ప్రారంభం: ఆగస్టు 16 నుంచి

ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ ప్రోగ్రామ్‌నకు:

దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: జూలై 20

అండర్‌ గ్రాడ్యుయేట్‌ నిక్మర్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలు: జూలై 22, 23

ఫలితాలు విడుదల: జూలై 26

ప్రోగ్రామ్‌ ప్రారంభం: సెప్టెంబరు 12 నుంచి

వెబ్‌సైట్‌: nicmar.ac.in

Updated Date - 2022-06-22T22:20:23+05:30 IST