వేపచెట్టుకు జన్మదిన వేడుకలు

Jul 29 2021 @ 23:30PM
వేపచెట్టు జన్మదిన వేడుకల్లో కేక్‌ను కట్‌ చేస్తున్న మునిసిపల్‌ కమిషనర్‌

 మహబూబాబాద్‌ టౌన్‌, జూలై 29 : మహబూబాబాద్‌ మునిసిపల్‌ కార్యా లయం వద్ద గురువారం టీ కొట్టు నిర్వాహకుడు శంకర్‌ వేపచెట్టుకు పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. చెట్టుకు బెలూన్‌లు కట్టి కేక్‌ను కట్‌ చేసి జన్మ దిన వేడుకలు వైభవంగా నిర్వహించాడు. స్థానిక మునిసిపల్‌ కార్యాలయం వద్ద హరితహారంలో భాగంగా తన టీకొట్టు గుమ్చీ పక్కనే 2017 జూలై 29న శంకర్‌ మొక్కను నాటాడు. ఆ మొక్కకు ట్రీగార్డును ఏర్పాటు చేసి పసిపిల్లలా సంరక్షిం చి దానిని పెంచాడు. ప్రతియేట జూలై 29న ఆ వేపచెట్టుకు జన్మదిన వేడుక లను నిర్వహిస్తాడు. ఆ తరహాలోనే గురువారం నాల్గొవ పుట్టిన రోజును వైభ వంగా నిర్వహించాడు. కమిషనర్‌ నరేందర్‌రెడ్డితో కేక్‌ను కట్‌ చేయించారు. అనంతరం కమిషనర్‌ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు శంకర్‌లాగా ఓ మొక్కను నాటి దానిని సంరక్షించి బావితరాలకు అందించాలని సూచించారు. డీఈ ఉపేందర్‌, వార్డు కౌన్సిలర్‌ ఎడ్ల వేణు, ఎలేందర్‌, శ్రీను పాల్గొన్నారు. 

 

Follow Us on: