మహానీయుల త్యాగ ఫలితంగానే స్వాతంత్య్రం

ABN , First Publish Date - 2022-01-27T05:49:53+05:30 IST

మహానీయుల త్యాగ ఫలితంగానే స్వాతంత్య్రం

మహానీయుల త్యాగ ఫలితంగానే స్వాతంత్య్రం
జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న కలెక్టర్‌ శశాంక, ఎస్పీ శరత్‌చంద్రపవార్‌, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌

జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు 

కలెక్టర్‌ శశాంక 

మహబూబాబాద్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి) : ఎంతో మంది మహానీయుల త్యాగఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని కలెక్టర్‌ శశాంక అన్నా రు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం గణతం త్ర దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ శశాంక జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ జిల్లా ప్రగతి నివేదికను వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంతో విశిష్ట గుర్తింపు పొందుతుందన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికల తో ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. అందరి సహకారంతో అన్ని రంగాల్లో జిల్లాను ప్రగతి పథంలో నిలిపి ఆదర్శంగా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్నామన్నారు. 

 పల్లెలే పట్టు కొమ్మలు..

దేశ సమగ్రాభివృద్ధికి పల్లెలే పట్టుకొమ్మలని, పల్లె స్వరూపాలను మార్చే విధంగా  ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని తీసుకువచ్చిందని కలెక్టర్‌ శశాంక అన్నారు. జిల్లాలోని 461 గ్రామ పంచాయతీల్లో పల్లెప్రగతి కార్యక్రమంతో అభివృద్ధికి బాటలు వేసినట్లు తెలిపారు. 702 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడంతో పాటు పారిశుద్యనివారణకు పా టు పడినట్లు పేర్కొన్నారు. ఆ విధంగా నాలుగు ము నిసిపాలిటీల్లో పట్టణ ప్రగతిద్వారా ప్రత్యేక నిధులు వెచ్చించి అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. తెలంగాణకు హరితహారంలో 47.03 లక్షల మొక్కలను నాటినట్లు తెలిపారు. జంగల్‌ బడావో.. జంగల్‌ బచావో కార్యక్రమం ద్వారా అడవులను సంరక్షించడం, 16 మండలాల్లో బృహత్‌ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

రైతులను  బలోపేతం చేసేందుకు..

రైతులను ఆర్థికంగా బలోపేంత చేసేందుకు ప్రభు త్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ అన్నా రు. జిల్లాలో రైతు బంధు పథకంలో పంట పెట్టుబడి కోసం ఖరీ్‌ఫకు 1,76,226 మంది రైతులకు రూ. 190 కోట్లు, రబీలో 1,76,11 మంది రైతులకు రూ. 198 కో ట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమచేసినట్లు వివరించారు. ధరణితో రైతుల చెంతకే రిజిస్ట్రేషన్లు ప్రక్రియ వచ్చిందని, అన్ని మండల తహసీల్దార్‌ ఆఫీసుల్లో వ్య వసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేసి పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు అందిస్తున్నామన్నారు. దళితబంధు పథకం తో అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నామన్నారు. కరోనా కట్టడికి టీ కాలు వేయడంతో పాటు ఫీవర్‌ సర్వేను చేపట్టామన్నారు. రూ.18కోట్లతో 82 రైతు వేదికలు నిర్మించడం తో పాటు ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స పథకం  కింద రూ.40 కో ట్లతో 380 వైకుంఠాధామాలను పూర్తి చేసినట్లు తెలిపారు. మిషన్‌భగీరథ ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్నామన్నారు. జిల్లా అభివృద్ధిలో భాగస్వాములవుతు న్న, సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కలెక్టర్‌  కృతజ్ఞతలు తెలిపారు.  ఎస్పీ శరత్‌చంద్రపవార్‌, ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌, అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌, ఆర్డీవో కొ మురయ్య, మునిసిపల్‌ కమిషనర్‌ ప్రసన్నారాణి, కలెక్టరేట్‌ ఏవో వెంకటరమణ, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-27T05:49:53+05:30 IST