77 మంది కాంగ్రెస్‌ నేతల అరెస్టు

ABN , First Publish Date - 2021-07-23T06:13:55+05:30 IST

77 మంది కాంగ్రెస్‌ నేతల అరెస్టు

77 మంది కాంగ్రెస్‌ నేతల అరెస్టు
మహబూబాబాద్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో అరెస్ట్‌ అయిన కాంగ్రెస్‌ నేతలు

మహబూబాబాద్‌ టౌన్‌, జూలై 22:  జిల్లా వ్యాప్తంగా గురువారం 77 మంది కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. పెగసస్‌ స్సైవర్‌ ద్వారా సోనియాగాంధీ, రాహూల్‌గాంధీ, ప్రియాంక గాంధీ మొబైల్స్‌ హ్యాక్‌ చేసి సమాచారం సేకరిస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజస్వామిక ధోరణిని నిరిసిస్తూ ఏఐసీసీ, టీపీసీసీలో పిలుపులో భా గంగా గురువారం రాజ్‌భవన్‌ ముట్టడికి పిలుపునివ్వగా జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణలు హైదరాబాద్‌కు తరలకుండా పోలీసులు అరెస్టు చేసి ఆయా పోలీస్‌ స్టేషన్‌లకు తరలించారు. వారిని సాయంత్రం సొంత పూచికత్తుగా విడుదల చేశారు. మహబూబాబాద్‌ పట్టణంలో కాంగ్రెస్‌ ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బానోత్‌ ప్రసాద్‌, వార్డు కౌన్సిలర్లు పోతు రా జు, తాళ్లపల్లి జగన్‌, నాయకులు నీరుటి సురేష్‌, విజయ్‌, సురేష్‌, రవీం దర్‌, జిలుగుల భాస్కర్‌, బల్లెం చంటిలను టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు, మహ బూబాబాద్‌ మండల అధ్యక్షుడు మిట్టకంటి రాంరెడ్డి, పూర్వ అధ్యక్షుడు దేవరం ప్రకాశ్‌రెడ్డి, జమీల్‌, యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కావటి జనార్దన్‌ను రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. కేసముద్రంలో టీపీసీసీ సభ్యులు గుగులోతు దస్రూనాయక్‌, పెద్దవంగరలో ఓరుగంటి సతీష్‌, నరేష్‌, డోర్నకల్‌లో మండల అధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్‌యాదవ్‌, గోపాల్‌, వెంకటేశ్వర్లు, యాకేష్‌, లక్ష్మణ్‌, శేఖర్‌, వెంకటయ్య, రాంకోటి, తొ ర్రూరు డివిజన్‌కేంద్రంలో మండల అధ్యక్షుడు సదాకర్‌, రవి, వినోద్‌, సురేష్‌, రాంబాబు, సాయి, దంతాలపల్లిలో ఎంపీటీసీ సతీష్‌, యాకయ్య తో పాటు మరో ముగ్గురు, గార్లలో మండల అధ్యక్షుడు దనియాకుల రా మారావు, నగేష్‌, భిక్షపతిగౌడ్‌, నవీన్‌, సాయి కుమార్‌, నాగ రాజు, కోటే ష్‌, కురవిలో డీవై.గిరి, బండి శ్రీనివాస్‌, వెంకటనారా యణ, సీరోలులో అంబటి వీరభద్రం, జెర్రిపోతుల రంగన్న, వీరన్న, గౌని వెంకన్న, బండి మల్లయ్య, రవీందర్‌, కొత్తగూడలో మం డల అధ్యక్షుడు వజ్జ సారయ్య, మల్లెల్ల రణధీర్‌, మండల కోఆప్షన్‌ సభ్యుడు ఎమ్డీ.సయ్యద్‌, వేణు, గూడూరులో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నూనావత్‌ రమేష్‌, బయ్యారంలో నలుగురిని అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, నిరంకుశపాలన సాగిస్తున్న కేంద్ర, రాష్ట్ర పాలకులకు కాలంచెల్లిందని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

Updated Date - 2021-07-23T06:13:55+05:30 IST