స్మార్ట్‌ ఫోన్‌ కొనివ్వలేదని..మనస్థాపంతో బాలిక ఆత్మహత్య

Jul 28 2021 @ 00:23AM
త్రిష(ఫైల్‌)

కొత్తగూడ, జూలై 27: స్మార్ట్‌ ఫోన్‌ కొనివ్వలేదని బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలంలోని ఎదుళ్లపల్లి గ్రా మంలో మంగళవారం జరిగింది. స్థానిక ఎస్సై సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఎదుళ్లపల్లి గ్రామానికి చెందిన కూస సంపత్‌ రెండో కూతురు కూస త్రిష(16) ఇంటర్మీడియట్‌ చదువుతోంది. ఆన్‌లైన్‌ తరగతుల కోసం స్మార్ట్‌ ఫోన్‌ కొనివ్వమని తండ్రి సతీ్‌షను కోరింది. తరువాత కొనిస్తానని తండ్రి చెప్పడంతో త్రిష మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే నర్సంపేట ఏరియా ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకెళ్లారు. కాగా, చికిత్స పొందుతూ మృతి చెందిందని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సురేష్‌ తెలిపారు.

Follow Us on: