రూ. 4.45 లక్షల అంబర్‌, గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

ABN , First Publish Date - 2021-06-17T05:42:25+05:30 IST

రూ. 4.45 లక్షల అంబర్‌, గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

రూ. 4.45 లక్షల అంబర్‌,  గుట్కా ప్యాకెట్ల స్వాధీనం
మహబూబాబాద్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో పట్టుకున్న అంబర్‌, గుట్కా ప్యాకెట్లను చూపిస్తున్న ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి

మహబూబాబాద్‌ రూరల్‌, జూన్‌ 16 : మహబూబాబాద్‌ జిల్లాలో అంబర్‌, గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.4.45 లక్షల విలువ చేసే ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ నంద్యా ల కోటిరెడ్డి వెల్లడించారు. మహబూబాబాద్‌ టౌన్‌ పోలీస్‌స్టే షన్‌ కాన్ఫరెన్స్‌హాల్‌ల్లో బుధవారం పోలీసులు పట్టుకున్న అం బర్‌, గుట్కా ప్యాకెట్లను చూపి కేసు వివరాలు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని నెహ్రూసెంటర్‌కు చెందిన వ్యాపారి కర్లపాటి రమేష్‌, పులిగోపాల్‌నగర్‌కు చెందిన మాలె లక్ష్మీనారాయణ, సాయిబాబా టెంపుల్‌రోడ్డుకు చెందిన పాలకుర్తి సత్యనారాయ ణ, మహబూబాబాద్‌ మండలం మల్యాల గ్రామానికి చెందిన పుల్లూరు పురుషోత్తం, చిన్నగూడూరు మండలం విస్సంపల్లి వాసి వేమిశెట్టి శ్రీనివాస్‌ కలిసి పెద్దమొత్తంలో అంబర్‌, గుట్కా ప్యాకెట్లను తీసుకువచ్చి జిల్లాలోని ఆయా గ్రామాల్లో కిరాణం, పాన్‌షాపుల్లో విక్రయిస్తున్నట్లు చెప్పారు. పక్కా సమాచారంతో మహబూబాబాద్‌, మరిపెడ, కురవి పోలీసులు ఆయా ప్రాం తాల్లో దాడులు నిర్వహించి మహబూబాబాద్‌లో ముగ్గురు కిరాణాషాపుల్లో 8,250 అంబర్‌ ప్యాకెట్లు, 3,320 జేకే ప్యాకెట్లు, గుట్కా, 1,380 టోబాకో గుట్కా ప్యాకెట్లు, 300 ఏ-1 టోబాకో గుట్కా ప్యాకెట్ల, మల్యాలలో పురుషోత్తం షాపులో 1,625 అంబర్‌, విస్సంపల్లిలో వేమిశెట్టి శ్రీనివాస్‌ కిరాణషాపులో 112 అంబర్‌ ప్యాకెట్లు, 8 ఆర్‌ఆర్‌ గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ఐదుగురు వ్యాపారులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వివరించారు. వీటి విలువ సుమారు రూ.4,45, 200 ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిషేదించిన అంబర్‌, గుట్కాలను విక్రయించిన, కొనుగోలు చేసిన వారిపై పీడీయాక్టు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చాకచక్యంగా అంబర్‌, గుట్కా ప్యాకెట్లను పట్టుకున్న మహ బూబాబాద్‌ టౌన్‌ సీఐ జూపల్లి వెంకటరత్నం, మహబూబాబా ద్‌ రూరల్‌ సీఐ రవికుమార్‌, మరిపెడ సీఐ సాగర్‌, ఎస్సైలు వెంకన్న, రాణాప్రతాప్‌, రమేష్‌బాబు, శ్రీనివాస్‌రెడ్డిలతో పాటు ఏఎస్సీ యోగేష్‌గౌతమ్‌, తొర్రూరు డీఎస్పీ వెంకటరమణతో పాటు సిబ్బందిని అభినందించారు. అనంతరం పోలీస్‌ అధికా రులు, సిబ్బందికి ఎస్పీ కోటిరెడ్డి రివార్డులు అందించారు.  

Updated Date - 2021-06-17T05:42:25+05:30 IST