షూటింగ్‌బాల్‌ విజేత మానుకోట

ABN , First Publish Date - 2022-10-01T05:51:14+05:30 IST

షూటింగ్‌బాల్‌ విజేత మానుకోట

షూటింగ్‌బాల్‌ విజేత మానుకోట
విజేతలకు బహుమతులు అందిస్తున్న అతిథులు

ముగిసిన రాష్ట్రస్థాయి పోటీలు

తొర్రూరు, సెప్టెంబరు 30: రాష్ట్రస్థాయి షూటింగ్‌బాల్‌ బాలుర విజేతగా మహ బూబాబాద్‌ జట్టు కైవసం చేసుకుంది. బాలికల విభాగంలో కామారెడ్డి జిల్లా జట్టు మొదటి స్థానంలో నిలిచింది. మూ డురోజులుగా తొర్రూర్‌లో నిర్వహిస్తున్న 41వ రాష్ట్రస్థాయి షూటింగ్‌బాల్‌ క్రీడా పోటీలు శుక్రవారం సాయంత్రం ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రంలోని 28 జిల్లాల నుంచి సుమారు 860 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. అండర్‌ -19 బాలికల విభాగంలో ఫైనల్‌ మ్యాచ్‌లో కామారెడ్డి జట్టు 19-16, 21-19 స్కోర్‌తో నల్లగొండపై విజయం సాధించింది. రెండో స్థానంలో నల్లగొండ, మూడో స్థానంలో హనుమకొండ జట్లు నిలి చింది. బాలుర విభాగం ఫైనల్స్‌లో మానుకోట జట్టు 22-16, 19-14 స్కోర్‌తో మెదక్‌పై విజయం సాధించింది. రెండో స్థానంలో మెదక్‌, మూడో స్థానంలో హనుమకొండ జట్టు నిలిచాయి. అనంతరం షూటింగ్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ రామసహాయం కిషోర్‌రెడ్డి అధ్యక్షతన ముగి ంపు సమావేశం ఏర్పాటు చేసి ప్రతిభ కనబ ర్చిన క్రీడాకారులందరికి బహుమతి ప్రదానం చేశారు. ఈసందర్భంగా షూటింగ్‌ బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మంగళపల్లి శ్రీనివాస్‌ మాట్లాడారు. ప్రస్తుతం నిర్వహి స్తున్న రాష్ట్రస్థాయి అండర్‌- 19తో పాటు మరికొద్ది రోజుల్లో అండర్‌- 14 పోటీలను కూడా ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో షూటింగ్‌ బాల్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.ఐలయ్య, ఎంపీపీ అంజయ్య, సీడబ్య్లూసీ చైర్‌పర్సన్‌ నాగవాణి, మునిసిపల్‌ చైర్మన్‌ రాంచంద్రయ్య, వైస్‌ చైర్మన్‌ సురేందర్‌ రెడ్డి, తహసీల్దార్‌ రాఘవరెడ్డి, రాయిశెట్టి వెంకన్న, ఏఎంసీ చైర్మన్‌ పసుమర్తి శాంత, పీఈటీలు, అసోసియేషన్‌ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-01T05:51:14+05:30 IST