టార్గెట్‌కు దగ్గరగా..

Published: Sun, 27 Mar 2022 23:53:42 ISTfb-iconwhatsapp-icontwitter-icon
టార్గెట్‌కు దగ్గరగా..

లక్ష్యానికి చేరువలో మార్కెట్ల ఆదాయం

డబ్బుల రాబడిలో కేసముద్రం టాప్‌

ద్వితీయ స్థానంలో మానుకోట..

మూడో ప్లేస్‌లో నిలిచిన తొర్రూరు..

మరిపెడ చెక్‌పోస్టు ద్వారా రూ.57 లక్షలు 

మరో నాలుగు రోజుల్లో ముగియనున్న ఆర్థిక సంవత్సరం 


మహబూబాబాద్‌ అగ్రికల్చర్‌, మార్చి 27 : జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లు ఆర్థికంగా పుంజుకుంటున్నాయి. ఉత్పత్తుల క్రయవిక్రయాలు దినదినం పెరుగుతోండటం, పన్నుల రూపంలో డబ్బులు వస్తోండటంతో బలపడుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో మహబూబాబాద్‌ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌ల ఆదాయం లక్ష్యానికి చేరువలో ఉన్నాయి. గత రెండు సంవత్సవాల నుంచి కరోనా బాధలో కూడా మార్కెట్ల ఆదాయం కొంత మేరకు తగ్గినా, ఈసారి మాత్రం కొంత నిలదొక్కుకున్నాయి. జిల్లాలోని కేసముద్రం మార్కెట్‌ ఆదాయం అన్ని మార్కెట్ల కంటే టాప్‌-1 లో ఉంది. మహబూబాబాద్‌ ద్వితీయస్థానం, తొర్రూరు తృతీయ స్థానంలో ఉంది. 


రికార్డు స్థాయిలో మరిపెడ చెక్‌పోస్టు ఆదాయం..

కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు 2021-22లో ప్రభుత్వం రూ.3.04 కోట్లు టార్గెట్‌ విధించింది. గత ఏడాది మార్కెట్‌ రూ.2.29 కోట్ల ఆదాయం సాధించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.2.47 కోట్లు ఆదాయం సాధించింది. మరో నాలుగు రోజులు ఆర్థిక సంవత్సరం గడువు ఉన్నప్పటికీ ఆదాయం రూ.2.80 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. అంతే కాకుండా సివిల్‌ సప్లయీస్‌ నుంచి ధాన్యం బాపతు బకాయిలు రూ.కోటికిపైగా, గోదాం కిరాయిలు కూడా రావాల్సి ఉంది. ఈ ఆదాయం గనుక వస్తే రూ.4 కోట్లకుపైగానే ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే కేసముద్రం మార్కెట్‌ పరిధిలో ఉన్న మరిపెడ చెక్‌పోస్టు మార్కెట్‌ చరిత్రలోనే రికార్డుస్థాయిలో మార్కెట్‌ ఫీజు వసూలు చేసి, అందరి మన్ననలు అందుకున్నారు. గత 2020-21లో మరిపెడ చెక్‌పోస్టు ఆదాయం రూ.3.94 లక్షలు ఉండగా, ఈసారి ఇప్పటి వరకు రూ.57 లక్షలు వసూలు చేసి రికార్డు సృష్టించింది. కేసముద్రం విలేజ్‌ చెక్‌పోస్టులో రూ.3.35 లక్షల ఆదాయం సాధించింది. మార్కెట్‌కు సరుకులు తగ్గిన ధరలు పెరగడంతో మార్కెట్‌ ఫీజు అత్యధికంగా సమకూరాయి. ఈ మార్కెట్‌కు ఆదాయం పెరిగేందుకు మార్కెట్‌ చైర్మన్‌ మర్రి నారాయణరావుతో పాటు మార్కెట్‌ కార్యదర్శి రాజా, సూపర్‌వైజర్‌ జి.రాజేందర్‌, మరిపెడ చెక్‌పోస్టులో జేఎంఎస్‌ కుమారస్వామి కృషి చేశారని చెప్పకతప్పదు. 


మానుకోట మార్కెట్‌లో..

మహబూబాబాద్‌ మార్కెట్‌ ఈ ఆర్థిక సంవత్సర లక్ష్యం రూ.4.10 కోట్లు. గతేడాది రూ.3.77 కోట్ల ఆదాయం రాగా, ఈసారి ఇప్పటి వరకు రూ.1.94 కోట్ల ఆదాయం గడించింది. ఇంకా రూ. కోటికి పైగా ధాన్యంకు సంబంధించిన బకాయిలు రావాల్సి ఉంది. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.36 కోట్లకుపైగా ఆదాయం రాగా, ఈ సారి మాత్రం ప్రభుత్వ శాఖల నుంచి అంతంత మాత్రమే ఆదాయం వచ్చింది. కేవలం గంజ్‌పైనే మార్కెట్‌ ఫీజు వచ్చింది. ఈ ఆదాయం సాధించడంలో మార్కెట్‌ చైర్‌పర్సన్‌ బజ్జూరి ఉమాపిచ్చిరెడ్డి, మార్కెట్‌ ఇన్‌చార్జి కార్యదర్శి రాజేందర్‌, సహాయ కార్యదర్శి ఖాజాపాషా కృషి చేశారు. 


తొర్రూరు.. మార్కెట్‌ అంతా చెక్‌పోస్టులపైనే..

తొర్రూరు మార్కెట్‌ విషయానికొస్తే భిన్నస్థాయిలో ఉంటుంది. ఈ మార్కెట్‌లో ప్రత్యక్ష కొనుగోళ్లు ఉండవు. కేవలం చెక్‌పోస్టుల ఆదాయంపైనే ఆధారపడి ఉంటుంది. 2020-21లో రూ.1.90 కోట్లు ఆదాయం రాగా, ఈ సారి ఇప్పటి వరకు రూ.1.67 కోట్లు మాత్రమే వచ్చాయి. పౌరసరఫరాల శాఖ నుంచి ధాన్యం బకాయిలు కోటికి పైగానే రావాల్సి ఉంది. తొర్రూరు పరిధిలోని తొర్రూరు చెక్‌పోస్టు, దంతాలపల్లి చెక్‌పోస్టులపై, మిల్లుల్లో జరిగే లావాదేవాలపైనే ఆదాయం లభిస్తోంది. మరో నాలుగు రోజుల్లో సుమారు రూ. 1.70 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ మార్కెట్‌ చైర్‌పర్సన్‌ పసుమర్తి శాంత, కార్యదర్శి సాలయ్య ఆదాయం సాధించేందుకు విశేషంగా కృషి చేశారు. ఏది ఏమైనా జిల్లాలో ఆయా వ్యవసాయ మార్కెట్‌లు ఆదాయం పెరుగుతుండడంతో కరోనా భారీ నుంచి బయటపడడం గమనించదగ్గ విషయం. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.