cold drinkలో బల్లి...అహ్మదాబాద్ మెక్‌డొనాల్డ్స్‌కు రూ.లక్ష జరిమానా

ABN , First Publish Date - 2022-06-08T17:55:18+05:30 IST

కోల్డ్ డ్రింక్‌లో (cold drink) బల్లి కనిపించిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో వెలుగుచూసింది....

cold drinkలో బల్లి...అహ్మదాబాద్ మెక్‌డొనాల్డ్స్‌కు రూ.లక్ష జరిమానా

అహ్మదాబాద్ (గుజరాత్): కోల్డ్ డ్రింక్‌లో (cold drink) బల్లి కనిపించిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో వెలుగుచూసింది. అహ్మదాబాద్ అవుట్‌లెట్‌లోని కోల్డ్ డ్రింక్‌లో చనిపోయిన బల్లి కనిపించడం కలకలం రేపింది.కోల్డ్ డ్రింకు గ్లాస్‌లో చనిపోయిన బల్లిని చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్ లో తనిఖీలు జరిపి,రూ.1లక్ష జరిమానా చెల్లించాలని ఆదేశించారు. మూడు నెలల పాటు అవుట్‌లెట్‌లో ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్లు మున్సిపల్ అధికారులు చెప్పారు.ఆర్డర్ చేసిన శీతల పానీయం గ్లాసులో చనిపోయిన బల్లిని చూపించే వీడియో సోషల్ మీడియాలో కనిపించడంతో మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్ కు మున్సిపల్ అధికారులు సీలు వేశారు.




భార్గవ్ జోషి అనే కస్టమర్ తన స్నేహితులతో కలిసి మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌లో శీతల పానీయాల గ్లాసులు, రెండు బర్గర్‌లను ఆర్డర్ చేశాడు.ఫిర్యాదు చేసి 4 గంటలకు పైగా గడిచినా, ఔట్‌లెట్‌లో ఎటువంటి చర్యలు తీసుకోలేదని భార్గవ్ జోషి వీడియోలో చెప్పారు. శీతల పానీయంలో చనిపోయిన బల్లి కనిపించిందని ఫిర్యాదు చేయడంతో అవుట్‌లెట్ సూపర్‌వైజర్ దీనికి బదులుగా రూ.300 చెల్లించడానికి ముందుకొచ్చారు.ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ దేవాంగ్ పటేల్ కూడా శీతల పానీయాల నమూనాలను అహ్మదాబాద్‌లోని పబ్లిక్ హెల్త్ లేబొరేటరీకి పరీక్ష కోసం పంపారు. కార్పొరేషన్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఔట్‌లెట్ తెరవరాదని మున్సిపల్ అధికారులు ఆదేశించారు.

Updated Date - 2022-06-08T17:55:18+05:30 IST