Russiaలో మెక్‌డొనాల్డ్స్, స్టార్‌బక్స్,కోకాకోలా, పెప్సికో విక్రయాల నిలిపివేత

ABN , First Publish Date - 2022-03-09T12:49:48+05:30 IST

ఉక్రెయిన్ దేశంపై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఆ దేశంలో మెక్‌డొనాల్డ్స్, స్టార్‌బక్స్, కోక్, పెప్సీ వ్యాపారాన్ని నిలిపివేస్తున్నట్లు బుధవారం ఆయా కంపెనీలు ప్రకటించాయి....

Russiaలో  మెక్‌డొనాల్డ్స్, స్టార్‌బక్స్,కోకాకోలా, పెప్సికో విక్రయాల నిలిపివేత

ఉక్రెయిన్ దేశంపై రష్యా దండయాత్ర నేపథ్యంలో...

మాస్కో: ఉక్రెయిన్ దేశంపై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఆ దేశంలో మెక్‌డొనాల్డ్స్, స్టార్‌బక్స్, కోక్, పెప్సీ వ్యాపారాన్ని నిలిపివేస్తున్నట్లు బుధవారం ఆయా కంపెనీలు ప్రకటించాయి.మెక్‌డొనాల్డ్స్, స్టార్‌బక్స్, కోకా-కోలా, పెప్సికో, జనరల్ ఎలక్ట్రిక్ గ్లోబల్ బ్రాండ్‌లు, యూఎస్ కార్పొరేట్ శక్తికి చిహ్నాలు... ఉక్రెయిన్‌పై దేశం దాడికి ప్రతిస్పందనగా రష్యాలో తమ వ్యాపారాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆయా కార్పొరేట్ కంపెనీలు ప్రకటించాయి. ఉక్రెయిన్ దేశంలో రష్యా దాడుల వల్ల ప్రజలు పడుతున్న బాధలను తాము విస్మరించలేమని మెక్ డోనాల్డ్స్ ప్రెసిడెంట్ క్రిస్ కెంప్ జిన్స్కీ ఉద్యోగులకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. చికాగో నగరానికి చెందిన బర్గర్ దిగ్గజం రష్యాలోని 850 దుకాణాలను తాత్కాలికంగా మూసివేస్తామని, కాని రష్యాలో పనిచేస్తున్న తమ 62వేలమంది ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామని కెంప్ జిన్స్కీ చెప్పారు. 


కంపెనీ తన స్టోర్లను ఎప్పుడు తిరిగి తెరవగలదో చెప్పడం అసాధ్యం అని కెంప్‌జిన్స్కీ చెప్పారు.మెక్‌డొనాల్డ్స్ వందలాది మంది రష్యన్ సరఫరాదారులతో కలిసి పని చేస్తుంది, ఉదాహరణకు, ప్రతి రోజు మిలియన్ల కొద్దీ కస్టమర్‌లకు సేవలు అందిస్తోంది. స్టార్ బక్స్ తన 130 రష్యన్ స్టోర్ల నుంచి వస్తున్న లాభాలను ఉక్రెయిన్ దేశంలో సహాయ చర్యలకు విరాళంగా ఇస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది.తర్వాత స్టార్ బక్స్ కంపెనీ తన పంథాను మార్చుకుని ఆ దుకాణాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపింది.కోకాకోలా కంపెనీ రష్యాలో తన వ్యాపారాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.స్విట్జర్లాండ్‌కు చెందిన కోకా-కోలా హెలెనిక్ బాట్లింగ్ కోకు రష్యాలో 10 బాట్లింగ్ ప్లాంట్‌లను ఉన్నాయి.పెప్సికో, జనరల్ ఎలక్ట్రిక్ రెండూ రష్యా దేశంలో తమ వ్యాపారాన్ని పాక్షికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించాయి.


Updated Date - 2022-03-09T12:49:48+05:30 IST