జంక్షన్‌ల అభివృద్ధికి చర్యలు

ABN , First Publish Date - 2022-07-06T05:49:29+05:30 IST

సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిఽధిలో ప్రమాదకరంగా ఉన్న పలు జంక్షన్లను సురక్షితమైన జంక్షన్లుగా అభివృద్ధి పరిచేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు.

జంక్షన్‌ల అభివృద్ధికి చర్యలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

- కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల, జూలై 5 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిఽధిలో ప్రమాదకరంగా ఉన్న పలు జంక్షన్లను సురక్షితమైన జంక్షన్లుగా అభివృద్ధి పరిచేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎస్పీ రాహుల్‌హెగ్డేతో  కలిసి  జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సిరిసిల్లలోని రగుడు, వేములవాడ ప్రాంత తిప్పాపూర్‌ జంక్షన్‌లు ప్రమాదకరంగా ఉన్నాయని, వాటిని అ అభివృద్ధి చేసే చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలోని పంచాయతీ రోడ్లకు సంబంధించి బోయినపల్లి మండలం శాభాష్‌పల్లి బ్రిడ్జి వద్ద, తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల శివారు ప్రాంతాల్లో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని,  వాటి నివారణకు కార్యాచరణ రూపొందించాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. సమావేశంలో జిల్లా రవాణాశాఖ అఽధికారి కొండల్‌రావు, ఆర్‌అండ్‌బీ ఈఈ కిషన్‌రావు, మున్సిపల్‌ కమిషనర్లు సమ్మయ్య, శ్యాంసుందర్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-06T05:49:29+05:30 IST