నకిలీలకు చెక్‌!

ABN , First Publish Date - 2020-07-14T11:41:25+05:30 IST

మాచారెడ్డి మండల పరిధిలోని నకిలీ పట్టాపాస్‌ పుస్తకాలు, సర్వే నంబర్లను రద్దుచేసేందుకు రెవెన్యూశాఖ కసరత్తు

నకిలీలకు చెక్‌!

భవానిపేట్‌ రెవెన్యూ రికార్డులనుంచి    859/డీ/3 సర్వేనంబర్‌ తొలగింపు

నకిలీ పట్టాపాస్‌ పుస్తకం, డాక్యుమెంట్లు స్వాధీనం

ఆర్డీవోకు సరెండర్‌ చేసిన మాచారెడ్డి రెవెన్యూ అధికారులు

రైతుబంధు నగదు రికవరీకి చర్యలు

భూ కబ్జాదారుడిపై క్రిమినల్‌ కేసు?


కామారెడ్డి, జూలై 13 (ఆంధ్రజ్యోతి): మాచారెడ్డి మండల పరిధిలోని నకిలీ పట్టాపాస్‌ పుస్తకాలు, సర్వే నంబర్లను రద్దుచేసేందుకు రెవెన్యూశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇటీవల మండలంలోని భవానిపేట లో లేని భూములకు జారీ అయిన నకిలీ పట్టాపాస్‌ పుస్తకాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. నకిలీ పట్టాపాస్‌ పుస్తకాలు, సర్వేనంబర్లతో కొందరు అక్రమార్కులు పట్టాభూములతో పాటు ప్రభుత్వ భూ ములను కబ్జా చేసిన విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ బట్టబ యలు చేసింది. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధి కా రులు సీరియస్‌గా తీసుకొని విచారణ చేపట్టాలని రెవె న్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మాచారెడ్డి మండల రెవెన్యూ అధికారులు కబ్జా అయి న భూముల్లో విచారణ చేపట్టారు. స్థానికంగా ఉన్న 865 సర్వేనంబర్‌లోని కొంతపట్టాభూమితో పాటు జి లానికుంటకు సంబంధించిన భూమిని కొందరు కబ్జా చేసినట్లు స్థానిక తహసీల్థార్‌ శ్రీనివాస్‌ తెల్చి చెప్పా రు. దీనిపై సమగ్ర విచారణ జరిపి పూర్తిని వేదికను తయారుచేశారు.లేని భూమికి మంజూరైన పట్టాపా స్‌ పుస్తకాలను రెవెన్యూ అధికారులు రద్దు చేశారు.


రెవెన్యూ రికార్డులోంచి సర్వే నెంబర్‌ తొలగింపు

మాచారెడ్డి మండలంలోని కొందరు రెవెన్యూ అధి కారులు సిబ్బంది నిర్వాకం వల్ల ఇష్టారాజ్యంగా లేని భూములకు పట్టాపాస్‌ పుస్తకాలను జారీ చేసిన సం ఘటనలు తరచూ బయటపడుతున్నాయి. రెండేళ్ల క్రి తం భూ ప్రక్షాళన సమయంలో భూమికంటే ఎక్కువ పట్టాపాస్‌పుస్తకాలు జారీచేయడం నకిలీ సర్వే నెంబ ర్లను రికార్డులో ఎక్కించడంపై స్థానిక రెవెన్యూ అధి కారులపై ఉన్నతాధికారులు శాఖపరమైన చర్యలు తీ సుకున్న సంఘటనలు ఉన్నాయి. ఐతే ఇటీవల అదే మండలంలోని భవానిపేట గ్రామంలోనూ లేనిభూమి కి సర్వేనంబర్‌లు ఇవ్వడంతో పాటు పట్టాపాస్‌పుస్తకా న్ని జారీ చేసిన విషయం వెలుగుచూసింది. అధి కారుల విచారణలోనూ 859/డీ/3 సర్వేనంబర్‌లో ఎ లాంటి భూమి లేకున్నా ప్రొసీడింగ్‌, పట్టాపాస్‌ పుస్త కం జారీ అయినట్లు తేలింది. ఈ సర్వేనంబర్‌లో ప ట్టాపాస్‌ పుస్తకం, ప్రొసిడింగ్‌లు, రిజిస్టేషన్‌ డాక్యుమెంట్లు అన్నీ అడ్డదారిన సృష్టించారని అధికారు లు నిర్ధారించారు. దీంతో ఈ సర్వే నెంబర్‌ను మండల రెవెన్యూ రికార్డుల్లోంచి అధికారులు తొలగించారు. దీం తో పాటు అక్రమార్కుల నుంచి నకిలీ పాస్‌ పుస్తకా లను ఇతర ధ్రువపత్రాలను స్వాధీనం చేసుకొని సీజ్‌ చేసినట్లు తెలిసింది. ఈ పూర్తినివేదికను మండల రెవె న్యూ అధికారులు కామారెడ్డి ఆర్డీవోకు సమర్పించారు.


రైతుబంధు నగదు రికవరీకి చర్యలు..

భవానిపేటలోని గ్రామస్థాయి ఓ ప్రజాప్రతినిది స్థానిక రెవెన్యూ సిబ్బందితో మిలాఖత్‌ అయి భూ దందా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సద రు ప్రజాప్రతినిధి మండల పరిధిలో పలుచోట్ల భూ మి లేకున్నప్పటికీ అడ్డదారిలో కొందరు రెవెన్యూ సి బ్బందితో కలిసి నకిలీ  సర్వేనంబర్‌లను సృష్టించి వీటి ఆధారంగా లీగల్‌గా పట్టాపాస్‌పుస్తకంతో పాటు రిజి స్ట్రేషన్‌ డాక్యుమెంట్లను పొందుతూ వస్తున్నాడు. ఇలా నే 859/డీ/3 నకిలీ  సర్వేనంబర్‌ను సృష్టించి అతడి కుటుంబసభ్యుల పేరిట పట్టాపాస్‌ పుస్తకాన్ని లీగల్‌ గా పొందడంతో పాటు వీటి ఆధారంగా రైతుబంధుకు అర్హుడుగా ఎంపికయ్యారు. దీంతో సదరు వ్యక్తి 2018 నుంచి 20 వరకు రైతుబంధు పథకం పేరిట అక్ర మంగా రూ.51,175 ప్రభుత్వ సొమ్మును కాజేసినట్లు అధికారుల విచారణలోనూ తేలింది. దీంతో అక్రమా ర్కుల నుంచి రైతుబంధు నగదును రికవరీ చేసేం దుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.


ఇప్పటికే ఈ సర్వే నెంబర్‌ పేరిట అడ్డదారిలో రైతుబంధు పొం దిన వారికి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. నకిలీ  పట్టాపాస్‌ పుస్తకాలు, డా క్యుమెంట్లతో భవానిపేట గ్రామపంచాయతీ పరిధి లోని 865 సర్వేనంబర్‌లోని పట్టాభూమి, పక్కనే ఉన్న కుంట భూములను కబ్జాచేసిన అక్రమార్కుడిపై, లేని భూమికి ప్రొసీడింగ్‌ జారీచేయడంతో పాటు సర్వే నెం బర్‌ ఇవ్వడం పట్టాపాస్‌ పుస్తకం జారీ చేసిన రెవె న్యూ అధికారి, సిబ్బందిపై రెవెన్యూ ఉన్నతాధికారులు శాఖపరమైన చర్యలు తీసుకునే  అవకాశాలు ఉన్నా యి. అక్రమంగా రైతుబంధు పొందిన వారిపై క్రిమి నల్‌ కేసులు పెట్టే అవకాశాలు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు.


859/డీ/3 సర్వేనంబర్‌ తొలగించాం: శ్రీనివాస్‌, తహసీల్దార్‌, మాచారెడ్డి

భవానిపేటలో భూముల కబ్జా, నకిలీ సర్వే నెం బర్‌లు, పట్టాపాస్‌ పుస్తకాలపై విచారణ చేపట్టి పూ ర్తినివేదికను ఆర్డీవోకు అందజేశాం. లేని భూమికి గ తంలో రెవెన్యూ రికార్డులో పొందుపరిచిన 859/డీ/3 సర్వే నెంబర్‌ భోగస్‌ అని తేలడంతో రికార్డులోంచి తొలగించాం. ఈ సర్వేనంబర్‌లోని పట్టాపాస్‌ పుస్త కాన్ని రద్దుచేశాం. ఈ నకిలీ  పట్టాపాస్‌ పుస్తకంతో రైతుబంధు పథకం ద్వారా లబ్ధి పొందిన నగదును రికవరీ చేస్తాం. భూమిని కబ్జాచేసిన నకిలీ  పట్టా పాస్‌ పుస్తకాలు సృష్టించిన వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2020-07-14T11:41:25+05:30 IST