మౌలిక వసతుల కల్పనకు చర్యలు

ABN , First Publish Date - 2022-05-20T05:23:22+05:30 IST

మౌలిక వసతుల కల్పనకు చర్యలు

మౌలిక వసతుల కల్పనకు చర్యలు
నాగారం మున్సిపాలిటీలో సమీకృత మార్కెట్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి మల్లారెడ్డి


  • కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి  
  • మార్కెట్‌కు శంకుస్థాపన

కీసర రూరల్‌, మే 19: మేడ్చల్‌ జిల్లాలోని మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని కార్మిక శాఖ రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. గురువారం నాగారం మున్సిపాలిటీ పరిధిలో రూ.4.5కోట్లతో చేపట్టనున్న సమీకృత(ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌) మార్కెట్‌ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపాలిటీల ప్రజలకు వారికి అవసరమైన అన్ని సదుపాయాలను పట్టణ పరిధిలోనే కల్పించేందుకు ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లు, మున్సిపల్‌ భూముల్లో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, పలుచోట్ల శౌచాలయాలు తదితర నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. తాగునీటి సరఫరా, పాఠశాలలు, వైకుంఠధామాలను సైతం అన్ని చోట్లా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలు నిత్యావసర వస్తువుల కొనుగోళ్లకు దూర ప్రాంతాలకు వెళ్ల వారి పట్టణంలోనే తాజా, నాణ్యమైన కూరగాయలు, పండ్లు లభించేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కె.చంద్రారెడ్డి, వైస్‌చైర్మన్‌ మల్లేష్‌, కమిషనర్‌ వాణిరెడ్డి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T05:23:22+05:30 IST