రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2022-06-25T05:42:01+05:30 IST

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి
సమీక్షిస్తున్న కలెక్టర్‌ గౌతమ్‌, సీపీ విష్ణు వారియర్‌

కలెక్టర్‌ గౌతమ్‌, సీపీ వారియర్‌

ఖమ్మం కలెక్టరేట్‌, జూన్‌24: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని  నిర్వహించారు.  జిల్లాలో 77 బ్లాక్‌ స్పాట్లు ఉన్నట్లు చెప్పారు. రోడ్డు మలుపులు, జంక్షన్లు, ప్రమాదాలు జరుగు ప్రదేశాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.  హైవేల పై ఉన్న గ్రామాల ప్రజలకు భద్రతపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్లపై పశు వులు తిరక్కుండా చూడాలన్నారు. రోడ్లపై వ్యూ అంత రాయం కలగకుండా చెట్లు కొమ్మలు పిచ్చిమెక్కలు తొల గించా లన్నారు. ట్రాక్టర్లు కేజీ వీల్స్‌ సమస్యలు రాకుండా చూడాలన్నారు. సీజ్‌ చేసిన వాహనాలను పట్టి కొనుగోలు చేసిన అనంతరం మాత్రమే విడుదల చేయాలన్నారు. 

ఇప్పటి వరకు 295 ప్రమాదాలు: సీపీ వారియర్‌

 ఈ ఏడాది ఇప్పటి వరకు 295 ప్రమాదాలు జరిగాయని, దీంట్లో 101 మంది మరణాలు సంభవించగా 284 మంది గాయపడ్డట్లు సీపీ వారియర్‌ తెలిపారు.  పోలీస్‌ స్టేషన్ల వారీగా వారివారి పరిధిలో ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు చేపట్టాలన్నారు. నగరపరిధిలో పోలీస్‌ అధికారులు మునిసిపల్‌ కమీషనర్‌తో సమావేశమై ఏఏ చోట్ల జాగ్రత్తలు తీసుకోవాలో అవసరాలు ఉన్నయో పరిశీలన చేసి అమలుకు కార్యాచరణ చేయాలన్నారు. ఇంజనీరింగ్‌ అధికారుల సహాకారంతో ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో చేపట్టాల్సిన పనులపై కార్యాచరణ చేపట్టాలన్నారు.  ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ స్నేహలత మొగిలి, ఖమ్మం మునిసిపల్‌ కమీషనర్‌ ఆదర్శ్‌ సురభి, అదనపు డీసీపీలు శబరీష్‌, ఏఎస్సీ బోస్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్యాం ప్రసాద్‌, జిల్లా రవాణాఅధికారి తోట కిషన్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి మాలతి, జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సోమిరెడ్డి, ఏసీపీలు సీఐలు అధికారులు పాల్గొన్నారు. 

  ఉపాధినిచ్చేలా ఎదగాలి

యువత ఉపాధి ఇచ్చేలా ఉన్నతంగా ఎదగాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ కోరారు. శుక్రవారం టీటీడీసీ సమావేశ మందిరంలో టీహబ్‌, తెలంగాణ ఇన్నోవే షన్‌ భాగస్వామ్యంతో కలిసి ఏర్పాటు చేసిన ఫ్రేం ఆఫ్‌ ఎంటర్‌ ప్రిన్యూర్‌ షిప్‌ కార్యక్రమంలో కలెక్టర్‌ గౌతమ్‌ మాటా ్లడారు. భారతదేశం ఇన్నోవేషన్‌ ఎకో సిస్టం కు నాయకత్వం వహించే గి- హిబ్‌ తన ఇన్నోవేషన్‌ భాగస్వాముల సహాకారంతో ఎంటర్‌ ప్రిన్యూర్‌ షిప్‌ ఇన్నోవేషన్‌ స్పూర్తిని వ్యాప్తికి టార్చ్‌ రన్‌, ఫ్లేమ్‌ ఆఫ్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌ షిప్‌ని నిర్వహిస్తుందన్నారు.  యువత కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చి ఆ లోచనలను ఆచరణలో పెట్టి ముందుకు నవాలని అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. సొంత వ్యాపారం చేయాలనే ఆలోచన కలగాలని దీనికి తగినట్లుగా ప్రణాళికలు చేయాలని కలెక్టర్‌ కోరారు. అభిరుచి వృత్తి ఒక్కటే అయినప్పుడు వ్యాపారం విజయవంతం అవుతుందన్నారు. ఆలోచనలకు చేదోడుగా పెట్టుబడి సమస్యకు పరిష్కారం దొరకాలని బ్యాంకులు కొత్త ఆలోచనలకు ప్రోత్సాహాన్ని అందించి వారికి పెట్టుబడి  రుణాలను అందించాలని ఆదేశించారు. దళితబంధు పథకం ఇదే తరహాది అని కలెక్టర్‌ అన్నారు.  ఈ కార్యక్రమంలో ఎల్డీఎం చంద్రశేఖర్‌, జీఎం అజయ్‌కుమార్‌, ఐటీఐ ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌టీ, పృథ్వి, శృతి, పారిశ్రామిక వేత్త నాగేశ్వరరావు  పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-25T05:42:01+05:30 IST