సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి

Jun 16 2021 @ 23:38PM
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కె శశాంక


 కలెక్టర్‌ కె శశాంక

కరీంనగర్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల ప్రబలకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కె శశాంక అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన సీజ నల్‌ వ్యాధులపై నిర్వహించిన సమావేశంలో శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు మలేరియా, విషజ్వరాలు డెంగ్యూ, చికెన్‌గున్యాలాంటి వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మూడు సంవత్సరాల్లో అధికంగా సీజనల్‌ వ్యాధులు ప్రబలిన చోట ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టా లని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో సానిటేషన్‌, మురికినీటి కాలువలను పరిశుభ్రం చేయాలన్నారు. వార్డులలో వారం రోజులపాటు సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఫాగింగ్‌ మిషన్‌ల ద్వారా స్ర్పే చేయాలన్నారు.  అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు పరి శుభ్రమైన నీరు అందించుటకు చర్యలు చేపట్టాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు. ప్రతి గ్రామంలో ఇంటింటికీ ఏఎన్‌ఎం, ఆశావర్కర్లు, అంగన్‌ వాడీ కార్యకర్తలు మూడో విడత ఇంటింటా జర సర్వేతోపాటు సీజనల్‌ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పరిశుభ్రమైన తాగునీరు, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పది రోజులకు ఒకసారి వాటర్‌ ట్యాంకులను క్లీన్‌ చేయాలని, ఓపెన్‌ ఫ్లాట్స్‌లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని ఆదేశించారు. ఐసీడీఎస్‌ క్లస్టర్లలో సమావేశాలు నిర్వహించాలని జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి ఆదేశించారు.ఈ సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ వల్లూరి క్రాంతి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ జువేరియా, పశు సంవర్థకశాఖ అధికారి డాక్టర్‌ నరేందర్‌, జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి శ్రీనివాస్‌, టీసీవో డాక్టర్‌ రవీందర్‌, జిల్లా సంక్షేమ అధికారి శారద, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు తదితరులు పాల్గొన్నారు. 


హరితహారంపై కలెక్టర్‌ సమీక్ష


 జిల్లాలో ఏడవ విడత హరితహారం కార్యక్రమం కింద మొక్కలు నాటేం దుకు కార్యాచరణ ప్రణాళిక శనివారంలోగా అన్ని శాఖలు సమర్పించాలని కలెక్టర్‌ కె శశాంక జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఏడవ విడత హరితహారంపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 2021 సంవత్సరంలో ఏడవ విడత హరితహారంలో జిల్లాలో 44 లక్షల 78 వేల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు. ప్రతి మండల కేంద్రంలో 10 వేల మొక్కలకుపైబడి మెగా ప్లాంటేషన్‌ పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేయాలన్నారు.  కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో నర్సరీ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఖాళీ స్థలా లు పచ్చగా కనిపించాలని అన్నారు. సమావేశంలో కార్పొరేషన్‌ కమిషనర్‌ వల్లూరి క్రాంతి, జిల్లా అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, జిల్లా గ్రామీణాభి వృద్ధి అధికారి శ్రీలత, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ జువేరియా, జిల్లా పంచాయతీ అధికారి వీరబు చ్చయ్య, పంచాయతీరాజ్‌ ఈఈ, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ నవీన్‌, జిల్లా వ్యసాయాధికారి శ్రీధర్‌, జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్‌రావు, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి శ్రీనివాస్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి పద్మావతి పాల్గొన్నారు. 

Follow Us on: