సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2021-06-17T05:40:31+05:30 IST

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధు లు ప్రబలకుండా స్థానిక ప్రజాప్రతినిధులు, ఆరోగ్య శాఖ సి బ్బంది చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సూచించారు.

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

- విపత్కర పరిస్థితుల్లోనూ రైతుబంధు     

- ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి     

పెద్దపల్లిటౌన్‌, జూన్‌ 16 : వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధు లు ప్రబలకుండా స్థానిక ప్రజాప్రతినిధులు, ఆరోగ్య శాఖ సి బ్బంది చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సూచించారు. స్థానిక ఆయన క్యాంపు కార్యాలయంలో బు ధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గ్రామాల్లో చెత్తచెదారం, మురుగునీటి గుంటలు పిచ్చిమొ క్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. హరితహారం లో కాలువగట్లు, ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాలు, పాఠశా లల్లో విరివిగా మొక్కలు నాటాలన్నారు. ఈయేడు పండ్ల మొక్కలతో పాటు, కూరగాయల విత్తనాలు పంపిణి చేయ న్నుట్లు తెలిపారు. ప్రతి ఇంటికి మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టే బాధ్యత అప్పగించాలని సూచించారు. తెలం గాణ ప్రభుత్వం రైతులకు పెద్ద పీట వేస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకుందన్నారు. ప్రాజెక్టులు చేపట్టి కోటిన్న ర ఎకరాలకు సాగు నీరందిస్తుందని వివరించారు. దేశంలో పెద్దఎత్తున ధాన్యాలు పండించే రాష్ట్రంగా నిలిచిందని వివ రించారు. రైతులకు అన్ని విధాలా ప్రభుత్వ సహకారాలు ఉండడం వల్ల రైతులు ఆర్థికంగా ఎదిగే పరిస్థితి ఏర్పడింద న్నారు. కేసీఆర్‌ ఆలోచన విధానంతో రాష్ట్రం ముందకు సా గుతోందన్నారు. విపత్కర పరిస్థితుల్లో సైతం రైతుబంధు అందజేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కేసీఆరే తమ నాయకుడన్నారు. ఆయన ఆలోచనల మేరకే పనిచేస్తామని స్పష్టం చేశారు. ఎన్ని రకాల ఎన్నికలు వచ్చినా ప్రజలు గెలి పించి కేసీఆర్‌కు బాసటగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమం లో బండారి రామ్మూర్తి, బండారి స్రవంతి శ్రీనివాస్‌, రమాదే వి, సంపత్‌యదవ్‌ తదితరులున్నారు.

Updated Date - 2021-06-17T05:40:31+05:30 IST