సీహెచ్‌సీ స్థాయి పెంచేందుకు చర్యలు

ABN , First Publish Date - 2020-11-30T05:04:19+05:30 IST

స్థానిక సామాజిక ఆస్పత్రి స్థాయి పెంచి వసతులు మెరుగుపరుస్తామని మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నా రు. ఆదివారం సీహెచ్‌సీలో రూ.5.30 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేశారు.

సీహెచ్‌సీ స్థాయి పెంచేందుకు చర్యలు
రోడ్డు పనులకు శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరిస్తున్న మంత్రి అప్పలరాజు

మంత్రి డాక్టర్‌ అప్పలరాజు

పలాస, నవంబరు 29: స్థానిక సామాజిక ఆస్పత్రి స్థాయి పెంచి వసతులు మెరుగుపరుస్తామని మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నా రు. ఆదివారం సీహెచ్‌సీలో రూ.5.30 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం 20 పడకలుగా ఉన్న ఆస్పత్రిని 50 పడకలుగా తీర్చిదిద్దడంతో పాటు మెటర్నటీ హెల్త్‌ క్లినిక్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.  అనంతరం డయాలసిస్‌ కేంద్రం, రోగుల వార్డులను పరిశీలించి మెరుగైన సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. కార్యక్రమంలో  సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమేష్‌, కమిషనర్‌ నారాయణ, ఎంపీడీవో రమేష్‌ నాయుడు, ఏఎంసీ చైర్మన్‌ పీవీ సతీష్‌, వైసీపీ నాయకులు బళ్ల గిరిబాబు, దువ్వాడ శ్రీకాంత్‌, కోత పూర్ణచంద్రరావు తదితరులు  పాల్గొన్నారు.


మునిసిపాల్టీ అభివృద్ధికి కృషి

కాశీబుగ్గ: మునిసిపాలీటీ అభివృద్ధికి కృషిచేస్తానని మంత్రి డాక్టర్‌ అప్పలరాజు హామీ ఇచ్చారు. ఆదివారం 13, 21 వార్డుల్లో అభివృద్ధి పను లకు శ్రీకారం చుట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి రామకృష్ణ మార్గ్‌లో రూ.87 లక్షలతో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశా రు. మంత్రి మాట్లా డుతూ మౌలిక వసతులకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. కార్యక్ర మం లో వార్డు ఇన్‌చార్జులు బోర బుజ్జి, పప్పల ప్రసాద్‌, ఎంఎన్‌ మూర్తి, దానేటి పద్మజీ కామేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. 


ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయం

హరిపురం: ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. హరిపురంలో రూ.2.10 కోట్లతో ఆస్పత్రి అదనపు భవనం, రూ.6.30 కోట్లతో హరిపురం నుంచి టి.గంగువాడ రోడ్డు నిర్మా ణానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. సంక్షే మంతో పాటు అభి వృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. డీఈఈ రామకృష్ణ, డీసీహెచ్‌ఎస్‌ సూర్యారావు, డాక్టర్‌ వర్మ, వైసీపీ నేతలు డొక్కరి దానయ్య, అందాల శేషగిరి, ఎస్‌.కిశోర్‌, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-30T05:04:19+05:30 IST