ప్రలోభాలను అడ్డుకోడానికి చర్యలు

ABN , First Publish Date - 2021-03-06T09:22:24+05:30 IST

‘‘పురపాలక ఎన్నికల్లో ధన, మద్య ప్రభావాలను అడ్డుకునేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకున్నాం. పట్టణ ఓటర్లందరూ ఎటువంటి ప్రలోభాలు, ప్రభావాలకు

ప్రలోభాలను అడ్డుకోడానికి చర్యలు

కాల్‌ సెంటర్‌కి ఫిర్యాదు చేస్తే చర్య తీసుకుంటాం: ఎస్‌ఈసీ


అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ‘‘పురపాలక ఎన్నికల్లో ధన, మద్య ప్రభావాలను అడ్డుకునేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకున్నాం. పట్టణ ఓటర్లందరూ ఎటువంటి ప్రలోభాలు, ప్రభావాలకు లోనవకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చూస్తాం. విశాఖ, వి జయవాడ, గుంటూరు, తిరుపతి వంటి వివిధ నగర పాలక సంస్థలు, కొన్ని పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ప్రలోభాల పర్వం ప్రారంభమైనట్లు గుర్తించాం’’ అని రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం తెలిపింది. ము న్సిపోల్స్‌లో ధన ప్రవాహాన్ని నిరోధించేందుకుగాను నగదు లావాదేవీలను నిశితంగా గమనిస్తూ ఉండాలని ఇప్పటికే ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఉన్నతాధికారులను కోరినట్లు పేర్కొంది. ఎన్నికల నైతిక ప్రవర్తనా నియమావళి కమిటీలు(ఎంసీసీ) శుక్రవారం నుంచే పూర్తిస్థాయిలో పని చేయడం ప్రారంభించాయన్నారు. నియమోల్లంఘనలపై ప్రజలు ఎస్‌ఈసీ కాల్‌ సెంటర్‌ ఫోన్‌ నంబర్‌ 0866-2466877కు కాల్‌చేయాలని పేర్కొంది. 

Updated Date - 2021-03-06T09:22:24+05:30 IST