జిల్లాలో 2100 బెడ్స్‌ ఏర్పాటుకు చర్యలు

ABN , First Publish Date - 2021-04-18T05:57:49+05:30 IST

కొవిడ్‌ పరీక్షలు పెంచడం, అవసరమైన వారికి చికిత్స లు అందించడం, వైరస్‌ వ్యాప్తి చెందకుండా అ వగాహన కల్పించడంతో పాటు వ్యాక్సిన్‌ ఇ ప్పించడంతో ప్రజలకు రిలీఫ్‌ కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మం త్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. శనివారం కరోనా వ్యాప్తి, అరికట్టడానికి చర్యలు, జిల్లా ఆసుపత్రులలో ఏర్పాట్లపై ఆయన కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, కలెక్టర్‌, సీపీ త దితరులతో సమీక్ష నిర్వహించారు.

జిల్లాలో 2100 బెడ్స్‌ ఏర్పాటుకు చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి

నిజామాబాద్‌అర్బన్‌, ఏప్రిల్‌ 17: కొవిడ్‌ పరీక్షలు పెంచడం, అవసరమైన వారికి చికిత్స లు అందించడం, వైరస్‌ వ్యాప్తి చెందకుండా అ వగాహన కల్పించడంతో పాటు వ్యాక్సిన్‌ ఇ ప్పించడంతో ప్రజలకు రిలీఫ్‌ కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మం త్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. శనివారం కరోనా వ్యాప్తి, అరికట్టడానికి చర్యలు, జిల్లా ఆసుపత్రులలో ఏర్పాట్లపై ఆయన కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, కలెక్టర్‌, సీపీ త దితరులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా లో 42 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని, రోజుకు 2500 మందికి పరీక్షలు నిర్వహించడం లక్ష్యంకాగా ప్రస్తుతం 5 వేల వరకు నిర్వహిస్తున్నామని అన్నారు. అవసరమైన కిట్‌లు ఎన్ని అవసరం అయితే అన్ని పం పించడానికి రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడానని, వారు అంగీకారం కూడా తెలిపారన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారికి వ్యాధి తీవ్రతను బట్టి ఆ సుపత్రులు, క్వారంటైన్‌ కేంద్రాల్లో చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రస్తుతం మూడు డివిజన్లలో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశామని, అవసరమైతే మరో ఆరు కేంద్రాలు ఏర్పాటుకు అధికారులకు సూచనలు చేసినట్లు చెప్పారు. నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌ ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రస్తుతం 405 ఆక్సిజన్‌తో కూడిన బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయని వీటిని 700 వరకు పెంచేలా ఆదేశించామన్నారు. మూడు 3 డివిజన్‌లలోని 70 ప్రైవేటు ఆసుపత్రులలో 1400 వరకు బెడ్స్‌ అందుబాటులో ఉండేవిధంగా మొత్తం 2100ల బెడ్స్‌ ఆక్సిజన్‌తో పాటు అందుబాటులో ఉండేలా సిద్ధం చేయాలని ఆదేశించామని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులలో ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఫీజులు తీసుకోవాల ని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాస్కు లేకుండా బయటకు రావద్దని కోరారు. ఇతర రాష్ట్రాల సరిహద్దుల వద్ద తనిఖీలు చే యాలని తెలిపారు. 45 ఏళ్లు దాటిన వారు వ్యాక్సిన్‌ తీసుకోవాలన్నారు. జి ల్లావ్యాప్తంగా మొత్తం 33 అంబులెన్స్‌లు పనిచేసేవిధంగా చూడాలని సూ చించారు. పాజిటివ్‌ గర్భిణులకు డెలివరీల కోసం ప్రతీ డివిజన్‌లో ఒక ఆ సుపత్రిని కేటాయించాలని, కొన్నిచోట్ల ఆక్సిజన్‌ కొరత ఉందని, దానిని త్వరలోనే అధిగమిస్తామన్నారు. సమావేశంలో కలెక్టర్‌ నారాయణరెడ్డి, సీపీ కార్తీకేయ, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌.వి పాటిల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-18T05:57:49+05:30 IST