ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి చర్యలు

ABN , First Publish Date - 2022-10-07T05:17:49+05:30 IST

పట్టణంలో అత్యంత రద్దీ ప్రాంతమైన ఠానా వద్ద ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి ఎస్‌ఐ రమే్‌షబాబు ఆధ్వర్యంలో పోలీసులు గురువారం ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి చర్యలు
ఎక్సకవేటర్‌తో మట్టిని తొలగిస్తున్న ఎస్‌ఐ రమే్‌షబాబు

రాయచోటిటౌన్‌, అక్టోబరు 6: పట్టణంలో అత్యంత రద్దీ ప్రాంతమైన ఠానా వద్ద ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి ఎస్‌ఐ రమే్‌షబాబు ఆధ్వర్యంలో పోలీసులు గురువారం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఠానా వద్ద రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాల వద్ద రోడ్డు ఆక్రమణకు గురైన విషయాన్ని గుర్తించి ఎక్సక వేటర్‌ ద్వారా దుకాణాల ముందు భాగంలో ఎత్తుగా ఉన్న మట్టిని పూర్తి స్థాయిలో తొలగించి ఫుట్‌పాత్‌ను ఉపయోగంలోకి తీసుకొచ్చారు. దీంతో వాహనదారులకు, పాదచారులకు కొంతవరకు ఉపశమనం కలిగినట్లయింది. 

Updated Date - 2022-10-07T05:17:49+05:30 IST