Advertisement

పది మార్కులు.. గ్రేడ్‌లకు ఎఫ్‌ఏ-4 లేనట్టే

Jun 30 2020 @ 06:03AM

మూడుఫార్మేటివ్‌,ఒకసమ్మేటివ్‌ పరీక్షల్లో ప్రతిభే కొలమానం 

ఎఫ్‌-4పై వచ్చిన విమర్శలను పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ 


ఏలూరు ఎడ్యుకేషన్‌, జూన్‌ 29 :కరోనా నేపథ్యంలో రద్ద యిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ప్రకటించ డానికి ప్రామాణికంగా తీసుకునే ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఎ-4) పరీక్షల మార్కులను ఉత్తీర్ణతకు పరిగణనలోకి తీసుకునే అవ కాశాలు కనిపించడం లేదు. సీఎస్‌ఈ వెబ్‌సైట్లో ఎఫ్‌ఎ-4 మార్కులను అప్‌లోడ్‌ చేయడానికి ఇంత వరకూ సంబంధిత లింక్‌ను ఓపెన్‌ చేయకపోవడమే ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్‌ఎ-4 పరీక్షలు ఈ ఏడాది జనవరిలోనే ముగియగా, విద్యార్థులు సాధించిన మార్కులను సీఎస్‌ఈ వెబ్‌సైట్లో ఇంత వరకూ ఎక్కడా ఆన్‌లైన్‌ చేయలేదు.


ఈలోగా కరోనా ఉధృతి వల్ల పది పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విద్యా శాఖ ఆ మేరకు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌, సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులను ప్రామాణికంగా తీసుకుని గ్రేడులు, మార్కులు ఇస్తామని ప్రకటించింది. ఆ లెక్కన ఒక్క విద్యార్థికి కూడా నష్టం కలుగకుండా గ్రేడులు, మార్కులు ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా విద్యా సంవత్సరంలో జరిగిన నాలుగు ఫార్మేటివ్‌, ఒక సమ్మేటివ్‌ (ఎస్‌ఏ-1) పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కు లను సీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు ఇటీవల అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే ఎఫ్‌ఎ-4 పరీక్షల మార్కుల అప్‌లోడ్‌ ఇంత వరకూ ఎక్కడా జరగకపోవడంతో పాఠశాలలు ఎవరి ఇష్టానుసారం గరిష్ట మార్కులు వేసు కుం టారన్న విమర్శలు చెలరేగాయి. దీనివల్ల ప్రతిభ గల విద్యార్థులకు నష్టం కలుగుతుందన్న వాదనలు బలంగా వినిపించాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ మూడు ఎఫ్‌ఎ పరీక్షలు, ఎస్‌ఏ-1 పరీక్షలో ఇప్పటికే మార్కులు నమోదుచేసిన విద్యార్థులు మినహా ఇంకా ఎవరికైనా పెండిం గ్‌లో ఉంటే అటువంటి విద్యార్థుల మార్కులను మాత్రమే తాజాగా నమోదు చేసేందుకు అవకాశం కల్పించింది.


ఆ ప్రకారం ఎఫ్‌ఏ-4 పరీక్షల మార్కుల నమో దుకు ఉద్దేశించిన సీఎస్‌ఈ వెబ్‌సైట్‌లోని లింకును మాత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఈ లింకులో ఎఫ్‌ఏ-4 పరీక్షల మార్కులను అప్‌లోడ్‌ చేయడానికి హెచ్‌ఎంలు, టీచర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ ఓపెన్‌ కావడం లేదు. దీంతో మూడు ఎఫ్‌ఏ పరీక్షలు, ఎస్‌ఏ-1 పరీక్షల్లో విద్యార్థి సాధించిన మార్కు లను క్రోడీకరించి పది ఉత్తీర్ణతను మార్కులు, గ్రేడుల వారీగా ప్రకటిస్తారని హెచ్‌ ఎంలు భావిస్తున్నారు.


ఎఫ్‌ ఏ-4 పరీక్షల మార్కులను తుది ఉత్తీర్ణతకు ప్రామాణికంగా తీసుకుంటారా, లేదా అన్నది అధికారికంగా ప్రకటించలేదని విద్యాశాఖ వర్గాలు తెలిపారు. జిల్లాలో పదో తరగతి పరీక్షలకు మొత్తం 49,039 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వీరందరి ఉత్తీర్ణతను మార్కులు, గ్రేడుల వారీగా ప్రకటించడానికి ఏ ఫార్ములాను పాటిస్తారో వెల్లడి కావాల్సి ఉంది. 

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.