కృష్ణా నదిలో మెకనైజ్డ్‌ బోట్లకు ఓకే

ABN , First Publish Date - 2021-07-25T06:04:13+05:30 IST

పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కి చెందిన దాదాపు అన్ని బోట్లకూ అనుమతులు వచ్చేశాయ్‌.

కృష్ణా నదిలో మెకనైజ్డ్‌ బోట్లకు ఓకే

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కి చెందిన దాదాపు అన్ని బోట్లకూ అనుమతులు వచ్చేశాయ్‌. స్పీడ్‌ బోట్లు, జెట్‌ స్కీయింగ్‌, పాంటూన్‌ బోట్లతో పాటు మెకనైజ్డ్‌ బోట్లు అయిన భవాని, కృష్ణవేణి, ఆమ్రపాలి, పల్నాడులకు కూడా అనుమతులు వచ్చాయి. బోధిసిరి డబుల్‌ డెక్‌ క్రూయిజర్‌కు మాత్రమే ఇంకా అనుమతులు రావాల్సి ఉంది. ప్రస్తుతం బోధిసిరికి మరమ్మతులు జరుగుతున్నాయి. మరో రెండు నెలల్లో ఇది కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దాదాపు బోట్లన్నింటికీ అనుమతులు రావటంతో విజయవాడలోని బోటింగ్‌ పాయింట్‌ పూర్తి స్థాయిలో పనిచేస్తోంది.  హరిత బెర్మ్‌పార్క్‌ నుంచి పున్నమిఘాట్‌, తాడేపల్లి పాయింట్‌, భవానీద్వీపం, పవిత్ర సంగమంల నుంచి బోట్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే కృష్ణానదికి వరద నీటి ప్రవాహం పెరగడంతో తాత్కాలికంగా బోటింగ్‌ను నిలిపివేశారు.

Updated Date - 2021-07-25T06:04:13+05:30 IST