medak: కారు దగ్ధం కేసును చేధించిన పోలీసులు

ABN , First Publish Date - 2021-08-11T16:21:06+05:30 IST

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం పరిధిలో జరిగిన కారు దగ్ధం కేసు పోలీసులు చేధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్థిక లావాదేవీలు హత్యకు గల కారణమని

medak: కారు దగ్ధం కేసును చేధించిన పోలీసులు

మెదక్: వెల్దుర్తి మండలం పరిధిలో జరిగిన కారు దగ్ధం కేసును పోలీసులు చేధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్థిక లావాదేవీలే హత్యకు గల కారణమని పోలీసులు నిర్ధారించారు. ధర్మకారి శ్రీనివాస్ మరొకరు కలిసి రూ. కోటిన్నర లోన్ తీసుకున్నారు. రూ. కోటిన్నర  డబ్బులు లోన్ కట్టే వ్యవహారంలో విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో గత కొన్ని రోజులుగా శ్రీనివాస్ లోన్ కట్టడకపోవడంతో శ్రీనివాస్ పై పార్ట్ నర్ కోపం పెంచుకున్నాడు. శ్రీనివాస్‎ పై కక్ష పెంచుకుని సుపారి ప్లాన్‎తో హత్య చేయించాడు. మంగళవారం సాయంత్రం దుండగులు రామాయంపేట రూట్‎లో అతి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం కారులోనే దుండగులు శ్రీనివాస్‎ డెడ్ బాడీతో ఆరుగంటల పాటు కారులోనే తిరిగినట్లు పోలీసుల విచారణలో నిందితులు తెలిపారు. నిందితులను సాయంత్రం 4 గంటలకు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Updated Date - 2021-08-11T16:21:06+05:30 IST