మెదక్‌ జిల్లాను సీడ్‌ హబ్‌గా తయారు చేయాలి

ABN , First Publish Date - 2022-06-29T05:40:24+05:30 IST

మెదక్‌ జిల్లాను సీడ్‌ హబ్‌గా చేయాలన్నది తమ సంకల్పమని వ్యవసాయ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ శోభ పేర్కొన్నారు.

మెదక్‌ జిల్లాను సీడ్‌ హబ్‌గా తయారు చేయాలి
చిలప్‌చెడ్‌లో రైతులకు అవగాహన కల్పిస్తున్న శాస్త్రవేత్తలు

 చెలక నేలల్లో  అధిక సాంద్రత విధానంలో పత్తిసాగు ఎంతో లాభదాయకం

 వ్యవసాయ సీనియర్‌ శాస్త్రవేత్త శోభ


చిల్‌పచెడ్‌, జూన్‌, 28: మెదక్‌ జిల్లాను సీడ్‌ హబ్‌గా చేయాలన్నది తమ సంకల్పమని వ్యవసాయ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ శోభ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని  చిల్‌పచెడ్‌లో గల రైతువేదికలో వ్యవసాయ అధికారులు ఖరీఫ్‌ సీజన్‌ సాగుపై  క్షేత్రస్థాయి ప్రదర్శనల సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  రైతులందరూ వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను సాగు చేయాలని సూచించారు. నేలలో సారం పెంచేందుకు తప్పకుండా పచ్చిరొట్టె ఎరువులను, సేంద్రియ ఎరువులను, వర్మీ కంపో్‌స్టలను వినియోగించాలన్నారు. ఎవరైనా కొత్తరకం విత్తనాను అమ్మడానికి వస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అధిక సాంద్రత పత్తి సాగు విధానం వల్ల రైతులకు ఎంతో లాభసాటిగా ఉంటుందన్నారు. పత్తి పంట అనంతరం నువ్వుల పంటను సాగు చేయడం కూడా ఎంతో లాభసాటిగా ఉంటుందని సూచించారు.  జొన్న పంట సాగు వల్ల రైతులు లాభాలు గడించవచ్చునని తెలిపారు. జీలుగా, జనుము సాగు చేయాలని వాటిని తాము కొనుగోలు చేయుటకు సిద్ధంగా ఉన్నామని శోభ పేర్కొన్నారు. వరిలో వెదజల్లే విధానం వల్ల కూడా రైతులకు అన్ని రకాలుగా మేలేనన్నారు. ఎరువులను రెండుదఫాలుగా చల్లాలని ఎక్కువ మోతాదులో చల్లడం వల్ల భూసారం దెబ్బ తింటుందని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి, ఏడీఏ పద్మ, రైతు సమన్వయ జిల్లా సభ్యుడు సయ్యద్‌హుస్సేన్‌, మండల కో-ఆర్డినేటర్‌ రాజిరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ ధర్మారెడ్డి, శాస్త్రవేత్తలు, రైతు సమన్వయ కర్తలు, రైతులు పాల్గొన్నారు.


పత్తిలో నూతన సాగు విధానంపై అవగాహన 


టేక్మాల్‌, జూన్‌ 28: మండలంలోని కాదులూరులో మంగళవారం నూతన పత్తి సాగు విధానంపై శంకరంపేట ఏడీఏ రాంప్రసాద్‌ ఆధ్వర్యంలో అవగాహన ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తి పంట సాగు చేసేటప్పుడు మొక్కకు మొక్కకు మధ్య దూరం 15 సెం.మీటర్లు ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ మేరకు ఎకరాకు 29, 630 మొక్కల సాంద్రత పాటించి, మేపిక్యాట్‌ క్లోరైడ్‌ అనే మందును పిచికారి చేసుకోవాలని సూచించారు. రైతు వసంత్‌రావు వ్యవసాయ క్షేత్రంలో పత్తి ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈవో లక్ష్మి, రైతులు పాల్గొన్నారు. 


రైతులు పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవాలి 


కంగ్టి, జూన్‌ 28: వ్యవసాయదారులు పంటల సాగు చేసే విషయంలో ఒకరికొకరు పోటీ పడి అవనసర ఖర్చులు చేసుకోకుండా తక్కువ పెట్టుబడితో యాజమాన్య పద్ధతులు పాటించి, అధిక దిగుబడులు పొందాలని ఏడీఏ కరుణాకర్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన కంగ్టి రైతువేదికలో రైతులకు పంటల సాగుపై సలహాలు, సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఏవో ప్రవీణ్‌చారి, ఏఈవో శ్రీవాణి, రైతుబంధు కోఆర్డినేటర్‌ వేణుదేశాయ్‌, తదితరులు పాల్గొన్నారు. 


చెన్నాపూర్‌లో వరిసాగుపై అవగాహన


శివ్వంపేట, జూన్‌ 28: మండలంలోని చెన్నాపూర్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఖరీ్‌ఫలో ఉపసర్పంచ్‌ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో వరిసాగుపై అవగాహన కల్పించారు. ఏఈవో మజిద్‌ మాట్లాడుతూ రసాయన ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలన్నారు. 


 

Updated Date - 2022-06-29T05:40:24+05:30 IST