Medak: కేసీఆర్ విమానాల కొనుగోలుపై షర్మిల సెటైర్లు

ABN , First Publish Date - 2022-10-04T02:46:01+05:30 IST

సీఎం కేసీఆర్‌ (Cm Kcr) తనకు తాను మహాత్మా గాంధీతో పోల్చుకోవడం విడ్డూరమని వైఎస్ షర్మిల (Ys Sharmila) ఎద్దేవా చేశారు. మెదక్ నియోజకవర్గం శంకరం పేట్‌లో ...

Medak: కేసీఆర్ విమానాల కొనుగోలుపై షర్మిల సెటైర్లు

మెదక్ (Medak): సీఎం కేసీఆర్‌ (Cm Kcr) తనకు తాను మహాత్మా గాంధీతో పోల్చుకోవడం విడ్డూరమని వైఎస్ షర్మిల (Ys Sharmila) ఎద్దేవా చేశారు. మెదక్ నియోజకవర్గం శంకరం పేట్‌లో ఆమె పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ఉద్యమాన్ని క్యాష్ చేసుకుందన్నారు.  కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిదర్శనమని చెప్పారు. ఇప్పుడు దేశాలు ఏలడానికి విమానాలు కొంటున్నారని షర్మిల విమర్శించారు. 



Updated Date - 2022-10-04T02:46:01+05:30 IST