కొనసాగిన భక్తుల మొక్కులు

ABN , First Publish Date - 2021-03-01T06:18:09+05:30 IST

కొనసాగిన భక్తుల మొక్కులు

కొనసాగిన భక్తుల మొక్కులు
వనదేవతల గద్దెల వద్ద మొక్కులు సమర్పించుకుంటున్న భక్తులు

మేడారంలో ప్రత్యేక పూజలు 

మేడారం, ఫిబ్రవరి 28: మేడారంలో ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు  సమ్మక్క-సారలమ్మ మినీ జాతర ముగిసినప్పటికీ ఆదివారం కూడా మొక్కులు కొనసాగాయి. జంపన్నవాగులో స్నానం ఆచరించిన  భక్తులు తలనీలాలు సమర్పించుకుని క్యూలైన్ల ద్వారా వనదేవతలను దర్శించుకున్నారు. పసుపు, కుంకుమ, బెల్లం(బంగారం), చీర, సారె, కొబ్బరికాయలు, కోళ్లు, మేకలు, గొర్రెలను నైవేద్యంగా సమర్పించుకున్నారు.

మేడారం సమ్మక్క-సారలమ్మలను పలువురు ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌ సెక్రటరీ అ శోక్‌కుమార్‌, వరంగల్‌ జిల్లా జడ్జి నర్సింగరా వు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధ ర్‌, పస్రా సీఐ అనుముల శ్రీనివాస్‌, ఎస్సై వెం కటేశ్వర్‌రావు కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకున్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. 

నేటి నుంచి వనదేతల గద్దెలు మూసివేత

  తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మల దర్శనాలను సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్లు దేవాదాయ శాఖ ఈవో రాజేంద్ర తెలిపారు. ఆదివారం ఆయన గద్దెల పరిసరాల్లో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఈవో రాజేంద్ర మాట్లాడుతూ ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు జరిగిన మినీ జాతరలో ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించిన ఇద్దరు సీనియర్‌ జూనియర్‌ అసిస్టెంట్లకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో అధికారులు, పూజారులు భయభ్రాంతులకు గురయ్యారని అన్నారు. పూజారుల సంఘం వినతి మేరకు 21 రోజులపాటు వనదేవతల గద్దెల దర్శనాలను నిలిపివేస్తున్నట్టు చెప్పారు. మినీజాతరలో వివిధ రాష్ట్రాల నుంచి  ఐదు లక్షలకుపైగా భక్తులు వచి ్చ మొక్కులు చెల్లించుకున్నారని అన్నారు. ప్రత్యేకంగా మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాల నుంచి అధికంగా తరలివచ్చారని అన్నా రు. రెండు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉందన్నారు. గద్దెల పరిసరాలు, క్యూలైన్లను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయిస్తున్నామని అన్నారు. 

 అధికారుల కృషి  అభినందనీయం

ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు వైభవంగా జరిగిన మినీ జాతరకు అధికారులు అందించిన సేవలను పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు కొనియాడారు. మినీ జాతర విజయవంతానికి అధికారులు ఎంతో శ్రమించారని అన్నారు. వనదేవతల దర్శనం, దొంగతనాలు జరగకుండా చర్యలు, ట్రాఫిక్‌ నియంత్రణ, పార్కింగ్‌, వసతిషెడ్ల ఏర్పాటు, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలను కరోనా నియమాలు పాటిస్తూ మినీజాతరను విజయవంతం చేశారని అన్నారు.  ఇందుకు  కలెక్టర్‌ ఎస్‌.కృష్ణఆదిత్య, ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జి.పాటిల్‌, ఏటూరునాగారం ఐటీడీఏ పీవో హన్మంత్‌ కె.జెండగే, పంచాయతీ జిల్లా అధికారి వెంకయ్య, ఈవో రాజేంద్ర, ములుగు, ఏటూరునాగారం ఏఎస్పీలు సాయిచైతన్య, గౌస్‌ఆలం తదితర శాఖల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.. ఈసమావేశంలో దేవాదాయ శాఖ సూపరింటెండెంట్‌ క్రాంతికుమార్‌, అధికారులు పాల్గొన్నారు. 

మేడారంలో వైద్య సేవలు 

శనివారం కరోనా భయంతో ఉన్న దేవాదాయ శాఖ అధికారులు, గ్రామస్థులు, పూజారులు వైద్య శిబిరంలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఎవరికీ పాజిటివ్‌ రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాకుండా గ్రామంలోని ప్రజలందరికీ  పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. 

Updated Date - 2021-03-01T06:18:09+05:30 IST