TS News: జీడిమెట్లలో దారుణం

ABN , First Publish Date - 2022-08-11T16:24:16+05:30 IST

జిల్లాలోని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. బ్యూటిషన్‌పై ఓ వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

TS News: జీడిమెట్లలో దారుణం

మేడ్చల్: జిల్లాలోని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. బ్యూటిషన్‌పై ఓ వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి స్నేహితుల ద్వారా  సంజీవరెడ్డి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. స్టూడియో పెట్టిస్తానని నమ్మించి పలుమార్లు బ్యూటిసియన్‌పై సంజీవరెడ్డి అత్యాచారం చేశారు. బుధవారం యువతి పుట్టినరోజు కావడంతో ఇంటికి వెళ్లి బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయాన్ని స్నేహితులతో చెప్పగా వారు అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-08-11T16:24:16+05:30 IST