జర్నలిస్టులకు అండగా మీడియా అకాడమీ

ABN , First Publish Date - 2020-07-07T07:38:15+05:30 IST

కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులకు తెలంగాణ మీడియా అకాడమీ అండగా నిలుస్తుందని అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ భరోసా ఇచ్చారు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన 197 మంది జర్నలిస్టులకు

జర్నలిస్టులకు అండగా మీడియా అకాడమీ

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులకు తెలంగాణ మీడియా అకాడమీ అండగా నిలుస్తుందని అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ భరోసా ఇచ్చారు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన 197 మంది జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన 128 మంది విలేకరులకు రూ.20 వేల చొప్పున రూ.25.60 లక్షలు, హోం క్వారంటైన్‌లో ఉన్న 69 మంది జర్నలిస్టులకు రూ.10 వేల చొప్పున రూ.6.90 లక్షల ఆర్థిక సహాయం అందించామని వెల్లడించారు. మొత్తం రూ.32.50 లక్షలను మీడియా అకాడమీ నిధుల నుంచి అందించినట్టు తెలిపారు. జర్నలిస్టులు తమ వివరాలను తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ వాట్సప్‌ నంబరు 8096677444కు పంపాలని కోరారు. మరిన్ని వివరాలకు మీడియా అకాడమీ మేనేజర్‌ (9676647807)ను సంప్రదించవచ్చని చెప్పారు.

Updated Date - 2020-07-07T07:38:15+05:30 IST