మెడికల్‌ కళాశాలకు పార్థివదేహం

ABN , First Publish Date - 2020-11-30T03:56:56+05:30 IST

నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రానికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలి పార్థివదేహాన్ని ప్ర భుత్వ మెడికల్‌ కళాశాలకు అప్పగించారు.

మెడికల్‌ కళాశాలకు పార్థివదేహం
పార్థివదేహాన్ని కళాశాలకు అప్పగిస్తున్న సరోజమ్మ కుటుంబీకులు

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం), నవంబరు 29 : నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రానికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలి పార్థివదేహాన్ని ప్ర భుత్వ మెడికల్‌ కళాశాలకు అప్పగించారు. ఊరబావి సరోజమ్మ అనే వృద్ధురా లు ఆదివారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో జన వి జ్ఞాన వేదిక సభ్యులు మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులతో మాట్లాడి ఆమె పార్థివదేహాన్ని మెడికల్‌ కళాశాలకు అప్పగించేలా ఒప్పించారు. దీంతో వే దిక సభ్యులు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాంకిషన్‌ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన ఆమె పార్థివదేహాన్ని ఆసుపత్రికి తీసుకొచ్చి ని వాళులు అర్పించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్‌ మాట్లాడుతూ మృత దేహం మట్టిలో కలవకుండా వైద్య విద్యార్థులకు పరిశోధనలు చేసేందుకు అవ కాశం ఉంటుందని, తన తల్లి మృతదేహాన్ని కూడా కళాశాలకు అప్పగించినట్లు గుర్తు చేసుకున్నారు. అనంతరం పార్థివదేహాన్ని మెడికల్‌ కళాశాలకు తీసుకెళ్లి అనాటమి విభాగాధిపతి డాక్టర్‌ నవకళ్యాణికి అధికారిక లాంఛనాల ప్రకారం అప్పగించారు. కార్యక్రమంలో జనరల్‌ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌ జీవన్‌, డాక్టర్‌ నర్సింహారావు, మృతురాలి కుటుంబ సభ్యులు ఊరబావి వెంకట్‌ రెడ్డి, నిర్మలమ్మ, సవితమ్మ, మావిరెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, ఆర్‌ఎంవోలు అనిల్‌, జ న విజ్ఞాన వేదిక అధ్యక్షుడు చరణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-30T03:56:56+05:30 IST