ఉద్యోగాలకు భద్రత కల్పించండి

ABN , First Publish Date - 2021-07-27T05:08:28+05:30 IST

తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని పట్టణ ఆరోగ్య కేంద్రాల తాత్కాలిక వైద్య సిబ్బంది కలెక్టర్‌ చక్రధర్‌బాబుకు విజ్ఞప్తి చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో ఏపీ అర్బన్‌ హెల్త్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు కలెక్టర్‌ను కలిశారు.

ఉద్యోగాలకు భద్రత కల్పించండి
కలెక్టర్‌కు సమస్యను వివరిస్తున్న వైద్య ఉద్యోగులు

కలెక్టర్‌కు పట్టణ ఆరోగ్య కేంద్రాల సిబ్బంది వినతి

నెల్లూరు(వైద్యం), జూలై 26 : తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని పట్టణ ఆరోగ్య కేంద్రాల తాత్కాలిక వైద్య సిబ్బంది కలెక్టర్‌ చక్రధర్‌బాబుకు విజ్ఞప్తి చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో ఏపీ అర్బన్‌ హెల్త్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు కలెక్టర్‌ను కలిశారు. యూనియన్‌ నేతలు మాట్లాడుతూ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఐదేళ్లుగా పనిచేస్తున్నామని, కరోనా సమయంలోనూ సేవలు అందించామన్నారు. అయితే ప్రస్తుతం పనిచేస్తున్న వారిని తొలగించి కొత్తగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిన నేపథ్యంలో తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన కోరారు. దీనికి కలెక్టర్‌ సానుకూలంగా స్పంధించి ప్రభుత్వానికి నివేదిక అందచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నేతలు కుమారి, సురేఖ, శృతి, హర్ష, వసుమతి, వెంకట రత్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T05:08:28+05:30 IST