మెడికల్‌ రిప్స్‌ సమ్మెను విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2022-01-18T05:34:30+05:30 IST

భానుగుడి (కాకినాడ), జనవరి 17: మందులు, వైద్యపరికరాలపై జీఎస్టీ పూర్తిగా తొలగించాలని.. సేల్స్‌ ప్రమోషన్‌, ఎంప్లాయిస్‌ యాక్ట్‌ పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్లతో బుధవారం మెడికల్‌ రిప్స్‌ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఏపీఎంఎ్‌సఆర్‌యూ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్‌ కోరారు. సోమవారం కలెక్టరేట్‌ సమీపంలో సీఐటీయూ నగర అధ్యక్షుడు

మెడికల్‌ రిప్స్‌ సమ్మెను విజయవంతం చేయండి
కాకినాడలో సమ్మె పోస్టర్లు ఆవిష్కరిస్తున్న నాయకులు

ఏపీఎంఎ్‌సఆర్‌యూ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్‌ 

భానుగుడి (కాకినాడ), జనవరి 17: మందులు, వైద్యపరికరాలపై జీఎస్టీ పూర్తిగా తొలగించాలని.. సేల్స్‌ ప్రమోషన్‌, ఎంప్లాయిస్‌ యాక్ట్‌ పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్లతో బుధవారం మెడికల్‌ రిప్స్‌ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఏపీఎంఎ్‌సఆర్‌యూ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్‌ కోరారు. సోమవారం కలెక్టరేట్‌ సమీపంలో సీఐటీయూ నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్రప్రభుత్వం యజమానులకు అనుకూలంగా తీసుకొచ్చిన 4 లేబర్‌ కోడ్లను రద్దు చేయాలని, సేల్స్‌ ప్రమోషన్స్‌ ఎంప్లాయిస్‌ చట్టం 1976 పటిష్టంగా అమలు చేయాలని, మెడికల్‌ రిప్స్‌ నిర్దిష్టమైన పనివిధానాలు రూపొందించాలని, అత్యవసర మందులు, వైద్య పరికరాలపై పూర్తిగా జీఎస్టీ తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఆన్‌లైన్‌లో జరుగుతున్న మందుల అమ్మకాలు ఆపాలని, ప్రభుత్వరంగ మందులను పునరుద్ధరించి వైద్య ఆరోగ్యరంగానికి జీడీపీలో 5శాతం నిధులు కేటాయించాలని కోరారు. మెడికల్‌ రిప్స్‌కు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పనివిధానాలు 9గంటలు నిర్దిష్టంగా అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేట్‌ మందుల కంపెనీలు కార్మికుల గ్రీవెన్స్‌ రెడ్రసెల్‌ ఫోరం గుర్తించి చర్చలు జరపాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా టీఏ, డీఏలను పెంచాలని ఆయన డిమాండ్‌ చేశారు. మెడికల్‌ రిప్స్‌పై జరుగుతున్న వేధింపాలన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు డి.వెంకన్న, కాకినాడ కార్యదర్శి ఏఆర్‌సీ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-18T05:34:30+05:30 IST