Good new for Expats: ప్రవాసులకు ఒమన్ తీపి కబురు.. ఇకపై..

ABN , First Publish Date - 2022-10-07T14:51:05+05:30 IST

ఒమన్‌లో కొత్త రెసిడెన్సీ పర్మిట్లు లేదా రెసిడెన్సీ వీసాల (Residency Visa)ను రెన్యువల్ చేసుకునే వారికి అక్కడి సర్కార్ తీపి కబురు చెప్పింది.

Good new for Expats: ప్రవాసులకు ఒమన్ తీపి కబురు.. ఇకపై..

మస్కట్: ఒమన్‌లో కొత్త రెసిడెన్సీ పర్మిట్లు లేదా రెసిడెన్సీ వీసాల (Residency Visa)ను రెన్యువల్ చేసుకునే వారికి అక్కడి సర్కార్ తీపి కబురు చెప్పింది. వీసా పునరుద్ధరణ సమయంలో వీసాదారులకు నిర్వహించే మెడికల్ టెస్టుల ఫీజులను తగ్గించనున్నట్లు ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనికోసం ప్రైవేట్ ఆరోగ్య సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఒమన్ ఆరోగ్యశాఖ మంత్రి డా. హిలాల్ బిన్ అలీ అల్-సబ్తీ మాట్లాడుతూ, ప్రవాసులు వైద్య పరీక్షల కోసం ముందుగా 30 ఒమనీ రియాళ్లు (రూ.6409) చెల్లించి, సనద్ కార్యాలయాల ద్వారా అభ్యర్థనను సమర్పించాలని తెలిపారు. ఆ తర్వాత ఎలాంటి రుసుము చెల్లించకుండానే ప్రైవేట్ వైద్య పరీక్ష కేంద్రాల్లో వైద్య పరీక్షలు చేయించుకోవచ్చన్నారు. ఈ మేరకు మంత్రి ప్రత్యేక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. నవంబర్ 1వ తేదీని నుంచి వలసదారులు ఎవరైతే తమ రెసిడెన్సీ వీసాలను రెన్యువల్ చేసుకుంటారో వారికి ఇది వర్తిస్తుందని చెప్పారు.  

Updated Date - 2022-10-07T14:51:05+05:30 IST