పిల్లల ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. లక్షలు విలువచేసే మందులు ఆహుతి

ABN , First Publish Date - 2022-06-04T23:00:48+05:30 IST

పాకిస్థాన్‌లోని లాహోర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గుల్‌బెర్గ్‌లో ఉన్న పిల్లల ఆసుపత్రిలో శనివారం ఉదయం ఈ అగ్నిప్రమాదం..

పిల్లల ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. లక్షలు విలువచేసే మందులు ఆహుతి

లాహోర్: పాకిస్థాన్‌లోని లాహోర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గుల్‌బెర్గ్‌లో ఉన్న పిల్లల ఆసుపత్రిలో శనివారం ఉదయం ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆసుపత్రిలోని మూడో అంతస్తులో ఉన్న ఫార్మసీ స్టోరేజ్‌లో లక్షలాది రూపాయలు విలువచేసే మందులు అగ్నికి ఆహుతయ్యాయని పాక్ స్థానిక మీడియా తెలిపింది.


ఏడు అగ్నిమాపక శకటాలను రంగంలోకి దింపారని, మంటలను అదుపు చేస్తూనే భవంతిలోని అందరినీ బయటకు తరలిస్తున్నారని సామా టీవీ తెలిపింది. మంటలు పెద్ద ఎత్తున చెలరేగంతో మరిన్ని అగ్నిమాపక శకటాలను కూడా రంగంలోకి దింపినట్టు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. 40 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఇంతవరకూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెబుతున్నారు. ప్రమాదానికి కారణాలు కూడా తెలియాల్సి ఉన్నారు. మంటలు చల్లారిన తర్వాతే ప్రమాద కారణాలు కనుగొనే వీలుందని అధికారులు తెలిపారు.


Updated Date - 2022-06-04T23:00:48+05:30 IST