ఏకాగ్రతను పెంచే బాలాసనం

ABN , First Publish Date - 2020-05-05T15:04:50+05:30 IST

వేసవి సెలవుల్లో సమ్మర్‌ క్యాంప్‌లో చేరేవారు. ఈత నేర్చుకొనేవారు. లాక్‌డౌన్‌ మూలంగా ఏదీ కుదరలేదు. మరి వ్యాయామం ఎలా? అందుకే ఇంట్లోనే రోజూ ఉదయం కాసేపు యోగా ప్రాక్టీస్‌ చేయండి. యోగా చేయడం వల్ల

ఏకాగ్రతను పెంచే బాలాసనం

ఆంధ్రజ్యోతి(05-05-2020):

వేసవి సెలవుల్లో సమ్మర్‌ క్యాంప్‌లో చేరేవారు. ఈత నేర్చుకొనేవారు. లాక్‌డౌన్‌ మూలంగా ఏదీ కుదరలేదు. మరి వ్యాయామం ఎలా? అందుకే ఇంట్లోనే రోజూ ఉదయం కాసేపు యోగా ప్రాక్టీస్‌ చేయండి. యోగా చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం చేకూరుతుంది. 


యోగాను ప్రాథమిక ఆసనాలతో ప్రారంభించాలి. ఈ ఆసనాన్ని బాలాసనం అంటారు. ఈ ఆసనం వేయడం వల్ల రిలాక్సేషన్‌ లభిస్తుంది. 

ముందుగా మోకాళ్లపై కూర్చోవాలి. తరువాత పాదాలపై పిరుదులు ఆనించి కూర్చోవాలి. దీన్ని వజ్రాసనం అంటారు.

తరువాత నుదురు భాగం మ్యాట్‌కు తగిలేలా ముందుకు వంగాలి. 

బొమ్మలో చూపిన విధంగా చేతులు ముందుకు చాచి, అరచేతులు మ్యాట్‌పై ఆనించి పెట్టాలి.

అలా ఉండి నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, వదలడం చేయాలి. కనీసం 30 సెకన్ల పాటు ఈ ఆసనం వేసినా చాలు. 

Updated Date - 2020-05-05T15:04:50+05:30 IST